NASA Prize For Human Poop In Space| అంతరిక్షంలో దాగి ఉన్న అనేక రహస్యాలను తెలుసుకోవడానికి మానవులు ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో సుమారు 50 ఏళ్లుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) ఇతర గ్రహాలపై తన వ్యోమగాములను పంపిస్తోంది. ఈ కారణంగా అక్కడ మానవ వ్యర్థాలు (Human waste) భారీ మొత్తంలో పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో నాసా ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ వ్యర్థాలను తొలగించడం లేదా రీసైకిల్ చేయడానికి వినూత్నమైన పరిష్కారం సూచించినట్లయితే, 3 మిలియన్ డాలర్లు (సుమారు 25 కోట్ల రూపాయలు) బహుమతిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసింది.
1969 సంవత్సరం నుంచి 1972 మధ్య కాలంలో ఆపోలో మిషన్ లో (Apollo Mission) భాగంగా నాసా తన వ్యోమగాములను చంద్రునిపై పరిశోధనల కోసం పంపించింది. విజయవంతంగా ఆరు మిషన్లు పూర్తి చేసింది. నెరవేరాయి. వ్యోమగాములు పరిశోధన కోసం చంద్రునిపై నుండి కొన్ని నమూనాలను తీసుకువచ్చారు. అయితే, లూనార్ మాడ్యూల్‌లో నిల్వ స్థలం పరిమితం కావడంతో, వ్యోమగాములు అనవసరమైన వస్తువులను అక్కడే విడిచిపెట్టి వచ్చారని నాసా ఇటీవలి కాలంలో తెలిపింది.
Also Read: ఏఐతో శిశువు జననం.. హైటెక్ బిడ్డ పుట్టిందోచ్…
ఈ విడిచిపెట్టిన వస్తువులలో మానవ వ్యర్థాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయని నాసా వెల్లడించింది. ఈ వ్యర్థాలను చిన్న చిన్న సంచుల్లో పెట్టి చంద్రునిపై వదిలేసి వచ్చారని తెలిపారు. ఈ విధంగా మొత్తం 96 సంచుల వ్యర్థాలు చంద్రునిపై ఉన్నాయి. ఈ వ్యర్థాలను అక్కడ నుండి తొలగించాల్సిన అవసరాన్ని గమనించిన నాసా ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దీనిని “లూనార్ రీసైకిల్ ఛాలెంజ్” పేరుతో ప్రారంభించారు. ఈ వ్యర్థాలను నీరు, శక్తి లేదా ఎరువుగా మార్చడానికి సృజనాత్మకమైన ఆలోచనలు సూచించమని ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానించారు. ఈ పోటీలో గెలిచిన వారికి 3 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని నాసా ప్రకటించింది.
చంద్రునిపై మాత్రమే కాకుండా, అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాములు తాము ఉపయోగించిన వస్తువులను రీసైకిల్ చేసి మళ్లీ వాడుకుంటున్నారు. అక్కడ ఉత్పన్నమయ్యే మానవ వ్యర్థాలను నిర్మూలించడం లేదా తిరిగి భూమికి తీసుకురావడం ఒక సవాలుగా మిగిలిపోయింది. ఈ దిశగా ఆలోచించిన నాసా ఇటీవల ఈ ప్రత్యేక ప్రకటన చేసింది. భవిష్యత్తులో చంద్రునిపై మానవులను తీసుకెళ్లడం మరియు అక్కడ వారి జీవనాన్ని మెరుగుపరచడంలో ఇప్పుడు సూచించే ఆలోచనలు చాలా ముఖ్యమైనవిగా మారనున్నాయి.