BigTV English
Advertisement

T20: గ్రూప్-1 తేలింది.. గ్రూప్-2 లెక్కేంటో..

T20: గ్రూప్-1 తేలింది.. గ్రూప్-2 లెక్కేంటో..

T20 వరల్డ్ కప్ లో గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీస్ బెర్తులు దక్కించుకున్నాయి. ఇక తేలాల్సింది… గ్రూప్-2 లెక్కే. అయితే… గ్రూప్-2 నుంచి ఏ జట్లకు సెమీస్ బెర్త్ రాసి పెట్టి ఉందో… ఆదివారం జరిగే 3 మ్యాచ్ లు ముగిశాకే తేలుతుంది. దాంతో… ఎవరిపై ఎవరు గెలిస్తే సమీకరణాలు మారతాయి? వర్షం వల్ల ఒకటో, రెండో మ్యాచ్ లు రద్దైతే పరిస్థితి ఏంటి? అని ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు.


గ్రూప్-2 నుంచి ప్రస్తుతం ఇండియా 6, సౌతాఫ్రికా 5, పాకిస్థాన్ 4, బంగ్లాదేశ్ 4 పాయింట్లతో ఉన్నాయి. అట్టడుగున ఉన్న జింబాబ్వే, నెదర్లాండ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించేసినా… రెండు జట్ల సెమీస్ బెర్తులను డిసైడే చేసే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఆదివారం నెదర్లాండ్స్ తో సౌతాఫ్రికా, జింబాబ్వేతో భారత్ ఆడాల్సి ఉంది. చిన్న జట్లపై సౌతాఫ్రికా, భారత్ గెలిస్తే… ఎలాంటి చిక్కులు లేకుండా రెండు జట్లు సెమీస్ చేరతాయి. ఫలితాలు తారుమారైతే పరిస్థితి మరోలా ఉంటుంది.

గ్రూప్-2 నుంచి ప్రస్తుతం 4 జట్లకు సెమీస్ ఛాన్స్ ఉంది. నెదర్లాండ్స్ పై సౌతాఫ్రికా, జింబాబ్వేపై భారత్ గెలిస్తే… బంగ్లా-పాక్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా రెండు జట్లు సెమీస్ చేరతాయి. అదే నెదర్లాండ్స్‌ చేతిలో సౌతాఫ్రికా… జింబాబ్వే చేతిలో భారత్‌ ఓడి… బంగ్లాపై పాక్ గెలిస్తే… అప్పుడు గ్రూప్‌-2 నుంచి ఆరేసి పాయింట్లతో భారత్, పాక్ సెమీస్‌ చేరతాయి. ఒకవేళ జింబాబ్వే చేతిలో భారత్ ఓడి… నెదర్లాండ్స్ పై సౌతాఫ్రికా, బంగ్లాపై భారీతో తేడాతో పాక్ గెలిస్తే… 7 పాయింట్లతో సౌతాఫ్రికా, 6 పాయింట్లతో పాటు మెరుగైన రన్ రేట్ తో పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్తాయి. ఒకవేళ నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడి… బంగ్లాదేశ్ పై పాక్ గెలిస్తే… జింబాబ్వేపై భారత జట్టు గెలుపోటములతో సంబంధం లేకుండా… 6 లేదా 8 పాయింట్లతో భారత్, 6 పాయింట్లతో పాక్ సెమీస్ చేరతాయి. అలా కాకుండా నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా, బంగ్లా చేతిలో పాకిస్థాన్ ఓడితే… జింబాబ్వేపై టీమిండియా గెలుపోటములతో సంబంధం లేకుండా… 6 లేదా 8 పాయింట్లతో భారత్, 6 పాయింట్లతో బంగ్లాదేశ్ సెమీస్ చేరతాయి. ఒకవేళ వర్షం కారణంగా భారత్-జింబాబ్వే మ్యాచ్ రద్దైనా… 7 పాయింట్లతో భారత్ సెమీస్ చేరుతుంది. అప్పుడు నెదర్లాండ్స్ పై సౌతాఫ్రికా గెలిస్తే 7 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. లేదా నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడితే… బంగ్లా-పాక్ మ్యాచ్ లో విజేత సెమీస్ చేరుతుంది. ఇన్ని సమీకరణాలు ఉన్నాయి కాబట్టే… గ్రూప్‌-2 నుంచి ఏ జట్లు సెమీస్‌కు వెళ్తాయనేది… నాలుగు దేశాల అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.


Tags

Related News

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Big Stories

×