T20 వరల్డ్ కప్ లో టీమిండియాను సెమీస్ చేర్చాలని ఐసీసీ ప్రయత్నిస్తోందటూ నిరాధార ఆరోపణలు చేసిన పాక్ మాజీ కెప్టెన్ అఫ్రీదికి… బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని… ఇష్టానుసారం మాట్లాడితే సహించబోమన్నాడు. క్రికెట్ ప్రపంచంలో భారత్ పవర్‌హౌజ్ లాంటిదైనా… తాము ప్రత్యేక ప్రయోజనాలేమీ పొందడం లేదని స్పష్టం చేశాడు.
బంగ్లాదేశ్ పై 5 పరుగుల తేడాతో భారత్ గెలిచాక… అఫ్రీదీ తన అక్కసునంతా వెళ్లగక్కాడు. వర్షం వల్ల మైదానం చిత్తడిగా మారినా మ్యాచ్ ఎలా కొనసాగిస్తారని అంపైర్లను ప్రశ్నించిన అఫ్రీదీ… భారత్‌ను సెమీస్ చేర్చేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశాడు. భారత్-పాక్ మ్యాచ్‌కు అంపైర్లుగా వ్యవహరించిన వారినే… భారత్-బంగ్లా మ్యాచ్‌కు కూడా అసైన్ చేశారని… వాళ్ల నిర్ణయాలు చూస్తుంటే… ఐసీసీ కచ్చితంగా భారత్‌కు మేలు చేసే వ్యూహం పన్నిందన్నాడు.. అఫ్రీదీ. అతని మాటలు భారత అభిమానులకే కాదు… బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి కూడా కోపం తెప్పించాయి.
ఆఫ్రిది వ్యాఖ్యలపై స్పందించిన రోజర్ బిన్నీ… ఐసీసీ టీమిండియాకు ఏ రకంగానూ అనుకూలంగా లేదన్నాడు. ప్రతి జట్టు విషయంలోనూ ఐసీసీ ఒకేలా వ్యవహరిస్తుందన్నాడు. మిగతా జట్ల కంటే భారత్ కు అదనంగా లభించిన ప్రయోజనాలు ఏంటని ప్రశ్నించిన బిన్నీ… ఏ ప్రాతిపదికన అలా మాట్లాడతావంటూ అఫ్రీదీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ ప్రపంచంలో టీమిండియా అతి పెద్ద పవర్ హౌజ్ అయినా… తమ జట్టుకూ మిగతా జట్లలాంటి ట్రీట్‌మెంటే లభిస్తుందని అఫ్రీదీకి కౌంటరిచ్చాడు… రోజర్ బిన్నీ.