Bollywood:సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో తెలియదు.. అలా అని ఎప్పుడు వివాహం చేసుకుంటారో కూడా తెలియదు. అయితే సడెన్ గా వివాహం చేసుకున్న తర్వాత జీవితాన్ని కొనసాగిస్తారా అంటే చెప్పలేని పరిస్థితి. కొంతమంది చిన్న చిన్నవిభేదాలకు విడిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే అలా భార్యాభర్తలు విడిపోతే భర్త నుండి భార్య తదుపరి జీవితాన్ని కొనసాగించడానికి భరణం తీసుకుంటుంది. అయితే ఒక్కొక్కసారి ఈ భరణం వందల కోట్లు కూడా ఉంటుంది. కానీ మరికొంతమంది భరణం లేకుండానే భర్తలకు దూరమైన వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ భార్యల నుండి విడిపోయిన తర్వాత వారి జీవనార్థం వందల కోట్ల రూపాయలను భరణంగా ఇచ్చుకున్న విషయం తెలిసిందే.
భర్తకే భరణం ఇచ్చిన భార్య..
అయితే ఇక్కడ ఒక నటి మాత్రం విడాకుల తర్వాత అన్నింటికీ విరుద్ధంగా తన భర్తకే భరణం చెల్లించి, తన బిడ్డ తనకు సర్వస్వం అని లక్షల రూపాయలు అతడికి ధారపోసాను. నా బిడ్డ కంటే మించిన ఆస్తి ఇంకోటి లేదు అంటూ చెప్పుకొచ్చింది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆమె ఎవరో కాదు ప్రముఖ హిందీ టెలివిజన్, సినిమా నటి శ్వేతా తివారీ (Swetha Tiwari). తన మాజీ భర్త రాజా చౌదరి (Raja Chaudhary) తో 2007లో విడాకులు తీసుకున్న ఈమె.. సెటిల్మెంట్ లో భాగంగా సుమారుగా 93 లక్షల రూపాయల విలువైన ఒక ప్లాట్ ను అతడికి భరణం గా ఇచ్చినట్లు తెలుస్తోంది. 1997లో వీరికి వివాహం జరిగింది. ఐదేళ్ల న్యాయపోరాటం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. శ్వేత గృహహింస, రాజా మద్యపాన అలవాటును విడాకుల కారణాలుగా తెలిపింది. ఇక తమ కుమార్తె పలక్ తివారీ సంరక్షణ పొందడానికి, శ్వేత ఇందుకోసం ఆస్తిని అతడికి ఇవ్వడానికి కూడా వెనుకాడ లేదు. మొదట్లో పలక్ తివారీతో ఫ్లాట్ ఉమ్మడి యాజమాన్య ప్రతిపాదన తిరస్కరించాడు. దీంతో ఆ ఫ్లాట్ ను పూర్తిగా వదిలేసింది. ఇక తన కుమార్తె సంరక్షణ తనకు ముఖ్యమని.. కూతురు కంటే ఏది కూడా ముఖ్యం కాదు అంటూ శ్వేతా తివారి స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన పనికి ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకొక వైపు భర్తకే భరణం ఇచ్చి రికార్డ్ సృష్టించిన భార్య అంటూ కామెంట్లు చేస్తున్నారు.
శ్వేతా తివారీ కెరియర్..
శ్వేతా తివారీ కెరియర్ విషయానికి వస్తే హిందీ సినిమా, టెలివిజన్ నటిగా పేరు సొంతం చేసుకుంది. 2000 సంవత్సరంలో ఆనే వాలా పల్ అనే సీరియల్ తో కెరియర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత నటిగా పరిచయమై స్టార్ ప్లస్ ఛానల్లో పలు సీరియల్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు 2011లో కామెడీ సర్కస్ కా నయా దౌర్ అని రియాల్టీ షోలో కూడా పాల్గొని విజేతగా నిలిచింది.
ALSO READ:Jailer 2: రంగంలోకి వివాదాస్పద వర్మ.. ఆ సన్నివేశాలే హైలెట్..!