IND VS AFG: టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (Team India vs. Afghanistan) మధ్య ఎల్లుండి నుంచి మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ (Afghanistan vs India in India 2026) ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ సిరీస్ కొనసాగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో జరగాల్సిన ఈ టోర్నమెంట్, భద్రతా కారణాల వల్ల ఇండియాలోనే నిర్వహిస్తున్నారు. టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మూడు టీ20లను ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగానే నిర్వహించబోతున్నారు. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురయింది. ఇండియాలో ఈ సిరీస్ జరుగుతున్నప్పటికీ… గెస్టులు వాడే డ్రెస్సింగ్ రూమ్ లను టీమిండియా ప్లేయర్లు వినియోగించుకోబోతున్నారు. అదే సమయంలో ఆఫ్ఘానిస్తాన్ ఆటగాళ్లు మాత్రం, ఇండియన్ ప్లేయర్ల డ్రెస్సింగ్ రూం వాడుకోనున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎల్లుండి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ టి20 సిరీస్ కు ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు హోస్ట్ గా వ్యవహరించనుంది. అంటే ఈ టోర్నమెంటుకు సంబంధించిన ఖర్చు అంతా ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (Afghanistan Cricket Board) భరిస్తుంది. దాంతో పాటు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియానికి ( Arun Jaitley Stadium, Delhi) ఆఫ్ఘనిస్తాన్ వాళ్లే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే మూడు టీ20 లకు పూర్తి బాధ్యత ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుదే. ఇలాంటి నేపథ్యంలో ఐసీసీ రూల్స్ టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాయి. మ్యాచ్ ఏ దేశంలో జరిగిన ఆ సిరీస్ అధికారికంగా ఎవరు హోస్ట్ చేస్తే వారే హోమ్ టీం గా మారుతారు.
ఆ జట్టుకే హోం డ్రెస్సింగ్ రూమ్ సౌకర్యాలు లభిస్తాయి. అంటే ఈ ప్రోటోకాల్ ప్రకారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉన్న రామన్ లాంబా డ్రెస్సింగ్ రూమ్ ను హోమ్ జట్టుగా ఉన్న ఆఫ్గనిస్తాన్ కు కేటాయిస్తారు. ఇక విజిటర్స్ జట్టుగా టీమిండియాను ట్రీట్ చేస్తూ… ప్రకాష్ బండారి డ్రెస్సింగ్ రూమ్ ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే హోమ్ డ్రెస్సింగ్ రూమ్ లో సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయి. అది గతంలో టీమిండియా( Team India) కోసం స్పెషల్ గా ఏర్పాటు చేశారు. కానీ టీమిండియాకు ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూమ్ లో… ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ క్రికెటర్లు జల్సాలు చేయనున్నారు. ఇదే టీమ్ ఇండియా ప్లేయర్లకు అస్సలు నచ్చడం లేదు.