Virender Sehwag On IND vs PAK Bowl-Out: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) గురించి నిత్యం ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. అతని కెప్టెన్సీని చాలా మంది మాజీ క్రికెటర్లు తక్కువగా చేస్తూ, మాట్లాడుతుంటే.. మరికొంత మంది చాలా మంది క్రికెటర్ల కెరీర్లను తొక్కేశాడని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 2007లో టి20 వరల్డ్ కప్ సందర్భంగా జరిగిన బాల్ అవుట్ (IND vs PAK Bowl-Out) సంఘటనపై వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బాల్ అవుట్ సందర్భంగా తాను మహేంద్రసింగ్ ధోనీకి సలహాలు ఇచ్చానని.. కానీ క్రెడిట్ మొత్తం అతడికి దక్కిందని బాంబు పేల్చారు. ఈ విషయాన్ని మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత కూడా ధోని చెప్పలేకపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
2007 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ స్టేజిలో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ డ్రా అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాల్ అవుట్ నిర్వహించింది ఐసీసీ. ఈ బాల్ అవుట్ ప్రకారం.. ఇరుజట్ల బౌలర్లు వికెట్లను గిరాటేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా వరుసగా మూడుసార్లు వికెట్లను గిరాటేస్తుంది. కానీ పాకిస్తాన్ బౌలర్లు.. వికెట్లను గిరాటేయడంలో విఫలమవుతారు. దీంతో 3-0 తేడాతో టీమిండియా విక్టరీ అందుకుంటుంది.
పాకిస్తాన్ తో జరిగిన ఈ బాల్ అవుట్ సంఘటనపై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాల్ అవుట్ సందర్భంగా మెయిన్ బౌలర్లు కాకుండా తనలాంటి స్పిన్నర్లను వేయించాలని ధోనితో తాను చర్చించినట్లు గుర్తు చేశారు. అందులో భాగంగానే తనతో పాటు హర్భజన్ సింగ్ అటు రాబిన్ ఉతప్ప బౌలింగ్ చేశామని వివరించారు. ఈ ప్లాన్ తనదేనని గుర్తు చేశారు. అయితే ఇక్కడ ధోని వికెట్ల వెనకాల నిలబడకుండా మోకాళ్ళపై కూర్చోవడం టీమిండియా కు కలిసి వచ్చిందని తెలిపారు.
కానీ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాలని చెప్పింది మాత్రం తానేనని.. ఆ క్రెడిట్ తనకు దక్కుతుందని వివరించారు. ఇది ఇలా ఉండగా… 2007 టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ధోని కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగింది. ఈ క్రమంలో వరుసగా అన్ని మ్యాచ్ లు గెలిచిన టీమిండియా… ఫైనల్స్ కు చేరింది. ఫైనల్స్ లో కూడా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా, విక్టరీ నమోదు చేసుకుంది. ఇలా టి20 ప్రపంచ కప్ మొదటి సీజన్ లోనే టైటిల్ అందుకుంది.