E-Paper
Advertisement

నెలరోజులు బ్యాడ్ బాయ్ తో ఒకే రూమ్ లో ఉండాలని కండిషన్… ఈ రొమాంటిక్ మూవీ చూశారా?

నెలరోజులు బ్యాడ్ బాయ్ తో ఒకే రూమ్ లో ఉండాలని కండిషన్… ఈ రొమాంటిక్ మూవీ చూశారా?
Advertisement

Romantic Drama: కాలేజీ ప్రేమకథలు చాలా చూసుంటాం. కానీ ఒక పందెం కారణంగా ఇద్దరు అపరిచితులు నెలరోజుల పాటు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తే? మొదట ఒకరినొకరు అస్సలు ఇష్టపడని ఇద్దరి మధ్య క్రమంగా ప్రేమ ఎలా పుడుతుంది? అనే ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన అమెరికన్ రొమాంటిక్ డ్రామా ‘Beautiful Disaster’. జామీ మెక్‌గ్వైర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. మరి ఈ సినిమాను మీరు ఎక్కడ చూడొచ్చు ? తెలుగులో ఉందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

అబ్బీ తన గత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయి కొత్తగా జీవించాలనే ఉద్దేశంతో మరో కాలేజీలో చేరుతుంది. ప్రశాంతంగా చదువుకోవడమే ఆమె లక్ష్యం. కానీ కాలేజీలో అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే ట్రావిస్ అనే యువకుడు ఆమె జీవితంలోకి వస్తాడు. ట్రావిస్ కాలేజీలో చదువుతున్నా, రాత్రిళ్లు అండర్‌గ్రౌండ్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటూ డబ్బు సంపాదిస్తుంటాడు. గొడవలు, ఫైట్లు, అమ్మాయిలతో సరదాగా తిరగడం అతని రొటీన్. అందుకే కాలేజీలో చాలామంది అతన్ని బ్యాడ్ బాయ్‌గా చూస్తుంటారు.

Advertisement

అబ్బీ మాత్రం ట్రావిస్ ప్రవర్తనను అస్సలు ఇష్టపడదు. అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని భావిస్తుంది. కానీ ట్రావిస్ మాత్రం అబ్బీని చూసిన మొదటి రోజు నుంచే ఆమెపై ఆసక్తి పెంచుకుంటాడు. ఎన్నిసార్లు మాట్లాడేందుకు ప్రయత్నించినా అబ్బీ పట్టించుకోదు. ఒకరోజు ట్రావిస్ ఆమెతో ఆసక్తికరమైన పందెం కాస్తాడు. రాబోయే బాక్సింగ్ పోటీలో తాను ఓడిపోతే నెలరోజుల పాటు తన జీవితంలో కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటానని చెబుతాడు. కానీ గెలిస్తే అబ్బీ నెలరోజుల పాటు తన ఇంట్లోనే ఉండాలని షరతు పెడతాడు. ట్రావిస్ తప్పకుండా ఓడిపోతాడని నమ్మిన అబ్బీ ఆ పందానికి అంగీకరిస్తుంది.

అయితే పోటీలో ట్రావిస్ అద్భుతంగా పోరాడి విజయం సాధిస్తాడు. దీంతో మాట తప్పలేని పరిస్థితిలో అబ్బీ అతని ఇంటికి వెళ్లి ఉండాల్సి వస్తుంది. మొదట ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతాయి. చిన్న చిన్న విషయాలకే వాదించుకుంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. బయటకు రఫ్‌గా కనిపించే ట్రావిస్‌లో ఉన్న మంచి మనసు అబ్బీకి తెలుస్తుంది. మరోవైపు అబ్బీ గతంలో దాచిపెట్టిన కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా నెమ్మదిగా బయటపడతాయి. ఒకరి బాధను మరొకరు పంచుకుంటూ వారి బంధం కొత్త మలుపు తిరుగుతుంది.

Advertisement

చివరికి ఆ నెలరోజుల ఒప్పందం తర్వాత ఇద్దరూ విడిపోయారా? లేక ప్రేమ వారిని ఒకటిగా చేసిందా? అబ్బీ గతం వారి బంధంపై ఎలాంటి ప్రభావం చూపింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ ?

ఈ చిత్రంలో డైలాన్ స్ప్రౌస్, వర్జీనియా గార్డనర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రోజర్ కంబుల్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో (Jio Hotstar) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉంది. రొమాన్స్, ఇదొక మంచి వీకెండ్ వాచ్. గొడవలతో మొదలైన బంధం ప్రేమగా ఎలా మారిందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.

Read Also: ప్రియుడిని చంపి పాతిపెట్టే సీఐ… ప్రియురాలు ఇచ్చే షాక్ కు దిమాక్ కరాబ్

Tags

Related News

దేశ స్వాతంత్ర్యం కోసం ఊపిరి వదిలిన వీరుల గాథ… నరనరాల్లో దేశభక్తిని రగిలించే పవర్ ఫుల్ ఎపిక్ సిరీస్

ఐఏఎస్ ఆఫీసర్ తీర్చుకున్న షాకింగ్ ప్రతికారం… ఊహకందని పొలిటికల్ రివేంజ్ థ్రిల్లర్

ఖాకీ డ్రెస్‌కి, క్రైమ్ సామ్రాజ్యానికి మధ్య సాగే రక్తపాతం… ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ అండ్ మైండ్ గేమ్ థ్రిల్లర్

వింత వైరస్ దాడితో సర్వనాశనమైన ప్రపంచం… తెలుగులోనే ఈ స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

విలన్‌తో అమాయకపు అమ్మాయి బాడీ స్వ్యాప్… భయపెట్టే కామెడీ రోలర్‌కోస్టర్ రైడ్

సినిమా ప్రపంచం వెనుక ఉన్న అసలు రంగులు… నవ్వులతో పాటు కన్నీళ్లు పెట్టించే వినోదాత్మక ప్రయాణం

జోజు జార్జ్ ఊచకోత తెలుగులోనే… నిమిషానికో మలుపు ఉన్న మలయాళం హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

ప్రేయసిని మర్చిపోవడానికి వెళ్లిన హీరోకు షాకింగ్ ట్విస్ట్… ట్రెక్కింగ్‌లో ఎక్స్ ఎంట్రీతో ఊహించని మలుపు

Big Stories

Advertisement
×