Shoaib Akhtar On Bowling: పాకిస్తాన్ మాజీ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు పాకిస్తాన్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ… ప్రత్యర్థి బ్యాటర్లను తన బంతులతో వణికించేవాడు. గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తాడు. 161.3 స్పీడ్ తో గతంలో వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు అతడి స్పీడ్ ను ఏ బౌలర్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. అలాంటి షోయబ్ అక్తర్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను అసలు పెద్ద బౌలర్ కాదని.. అదంతా ఫేక్ అన్నారు. తన బౌలింగ్ అంటే బ్యాటర్లు భయపడేలా ప్రవర్తించి.. బందులు వేసే వాడినని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తన బౌలింగ్ అంటే బ్యాటర్లు భయపడిపోయేవారని గుర్తు చేశారు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ మాజీ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
తన బౌలింగ్ యాక్షన్ పై పాకిస్తాన్ రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పెద్ద బౌలర్ కాదని… కేవలం వేగంగా బౌలింగ్ చేసే వాడినని తెలిపారు. 150 కిలో మీటర్ల వేగంతో ప్రతి బంతి వేసే వాడినని పేర్కొన్నారు. తాను సరిగ్గా వికెట్లు తీయకపోయినా… వేగంగా బంతులు వేసే వాడినని చెప్పుకొచ్చారు. కాలు విరిగినా, నడవలేక పరిస్థితి ఉన్న.. వేగం మాత్రం తగ్గించేది లేదన్నట్లుగా తాను బౌలింగ్ చేసినట్లు గుర్తు చేశారు.
అలాగే పొడవాటి జుట్టును పెంచుకొని బ్యాటర్లను భయపట్టించేవాడినని స్పష్టం చేశారు. మెడలో పెద్ద పెద్ద గొలుసులు, ముఖంపై ఘాట్లు పెట్టుకొని అప్పుడప్పుడు బ్యాటర్లను వనికించేవాడిన అని చెప్పుకొచ్చారు. దీంతో బ్యాటర్లు తన బౌలింగ్ అంటే భయపడిపోయి.. వికెట్లు సమర్పించుకునే వారని తెలిపారు. చాలా సందర్భాలలో డాక్టర్ల తలకాయలు కూడా పగలగొట్టానని వెల్లడించారు. మొత్తానికి తానో బేవర్స్ , బద్మాష్ గాడినేనని ఒప్పుకున్నారు. తన అవతారం, బౌలింగ్ స్పీడ్ కే బ్యాటర్లు వణికిపోయేవారని చెప్పారు.
రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 444 వికెట్లు పడగొట్టాడు. వన్డేలలో అత్యధికంగా 247 వికెట్లు తీసిన షోయబ్ అక్తర్, టెస్టుల్లో 178 వికెట్లు పడగొట్టాడు. టి20 లలో 19 వికెట్లు తీసిన షోయబ్ అక్తర్, అటు ఐపిఎల్ లో కూడా ఐదు వికెట్లు పడగొట్టడం జరిగింది. అతని హైయెస్ట్ స్పీడ్ 161.3 కాగా… లోయస్ట్ స్పీడ్ 100.2 గా ఉంది. పది వికెట్లను తన కెరీర్ లో రెండు సార్లు పడగొట్టాడు.