BigTV English

OTT Movie : కోట్లాది ప్రజల ప్రాణాలు గాల్లో… సీక్రెట్ ప్లేస్ లో దాక్కొని సినిమా చూసే దిక్కుమాలినోళ్లు… క్షణక్షణం ఉత్కంఠ

OTT Movie : కోట్లాది ప్రజల ప్రాణాలు గాల్లో… సీక్రెట్ ప్లేస్ లో దాక్కొని సినిమా చూసే దిక్కుమాలినోళ్లు… క్షణక్షణం ఉత్కంఠ

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు ఒక సరికొత్త థ్రిల్లర్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. మూడో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ సిరీస్ మొదలవుతుంది. ఒక బంకర్‌లో తల దాచుకున్న కొంతమంది బిలియనీర్ల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఇది ‘స్క్విడ్ గేమ్’, ‘మనీ హీస్ట్’ లాంటి సిరీస్ లను గుర్తు చేస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


కథలోకి వెళ్తే

మూడో ప్రపంచ యుద్ధం ఆరంభమయ్యే సమయంలో, కొంతమంది బిలియనీర్లు అండర్‌గ్రౌండ్ పార్క్ అనే లగ్జరీ బంకర్‌లో ఆశ్రయం పొందుతారు. ఈ బంకర్‌లో బాస్కెట్‌బాల్ కోర్ట్, రెస్టారెంట్, జెన్ గార్డెన్, కాక్‌టెయిల్ బార్, జిమ్, స్పా, సైకాలజిస్ట్ కౌచ్ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. బయట ప్రపంచం కూలిపోతున్న దృశ్యాలను వీళ్ళంతా స్క్రీన్‌ల ద్వారా చూస్తుంటారు. కానీ బంకర్‌లో రెండు కుటుంబాల మధ్య పాత శత్రుత్వం మళ్ళీ మొదటికొస్తుంది. గిల్లెర్మో, మినర్వా ఒక కుటుంబానికి, ఫ్రిడా, రాఫా మరొక కుటుంబానికి నాయకత్వం వాహిస్తుంటారు. ఈ సమయంలో ఒక వ్యక్తి జైలు నుండి విడుదలై తన తండ్రితో ఈ బంకర్‌లో చేరతాడు. అక్కడ వాళ్లు కూడా ఒక కుటుంబంతో గొడవలు పడుతుంటారు.

బయట యుద్ధం భీకరంగా మారుతుండగా, లోపల ఈ కుటుంబాల మధ్య పాత పగలు బయటపడతాయి. ఇది క్లాస్ట్రోఫోబిక్ వాతావరణంలో ఒక సైకలాజికల్ డ్రామాగా మారుతుంది. ఈ రెండు కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు బంకర్‌లో ఒక రకమైన ఖైదీ వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది Squid Game, Money Heist లాంటి సిరీస్ లను గుర్తు చేస్తుంది. ఈ సమయంలో బిలియనీర్లు తమ గత హోదాను కోల్పోయి, ఈ భూగర్భ ప్రపంచంలో ఎలా బతకాలో నేర్చుకుంటారు. క్లైమాక్స్‌ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ముగుస్తుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? ఈ రెండు కుటుంబాల గతం ఏమిటి ? వెళ్ళు ఎందుకు గోడవ పడుతున్నారు ? అసలు ఈ మూడో ప్రపంచ యుద్ధం ఎలా మొదలైంది ? ఇది ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ వెబ్ సిరీస్ ను చూసి  తెలుసుకోండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘బిలియనీర్స్ బంకర్’ (Billionaires bunker) 2025లో విడుదలైన స్పానిష్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనిని ఎస్తేర్ మార్టినెజ్, ఆలెక్స్ పినా (మనీ హీస్ట్ సృష్టికర్తలు) రూపొందించారు. ఇందులో జోక్విన్ ఫర్రియల్ (గిల్లెర్మో), మిరెన్ ఇబార్గురెన్ (మినర్వా), నటాలియా వెర్బెకే (ఫ్రిడా), కార్లోస్ సాంటోస్ (రాఫా), ఆలిసియా ఫాల్కో ప్రధాన పాత్రల్లో నటించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్ 2025 సెప్టెంబర్ 19న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ అయింది. ప్రతి ఎపిసోడ్ 45 నిమిషాలతో IMDbలో 7.2/10 రేటింగ్ అందుకుంది.

Read Also : పొరుగింటి వాడితో భార్య… మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చే భర్త… చక్కిలిగింతలు పెట్టే మలయాళ ఫ్యామిలీ డ్రామా

Related News

OTT Movie : అమ్మాయిల మంచం కింద దూరి సైకో అరాచకం… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie: తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసే కూతురు.. పెళ్లి కాకుండానే ప్రియుడితో అలా..

OTT Movie : బంగారం గొలుసు తీగ లాగితే మర్డర్ డొంక కదిలే… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చావు ఇంట్లో ముసలావిడ చెవిదుద్దులు మిస్సింగ్… కట్ చేస్తే కళ్ళు తిరిగే ట్విస్టు… మస్ట్ వాచ్ తమిళ థ్రిల్లర్

Bakasura Restaurant OTT: నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న బకాసుర రెస్టారెంట్!

Big Stories

×