BigTV English
Advertisement

RCB: దరిద్రం అంటే RCBదే.. 8 మంది ప్లేయర్లు దూరం.. ఇక కప్పు కష్టమే ?

RCB: దరిద్రం అంటే RCBదే.. 8 మంది ప్లేయర్లు దూరం.. ఇక కప్పు కష్టమే ?

RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ పునః ప్రారంభం కాకముందే.. ఏకంగా ఎనిమిది మంది ప్లేయర్లు ఆ జట్టుకు దూరం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ఎన్నడు లేని విధంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే దాదాపు ప్లే ఆఫ్.. బెర్త్ కన్ఫామ్ చేసుకుంది రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టు.


అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగడం… దీంతో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడడం జరిగింది. ఈ దెబ్బకు ఐపీఎల్ 2025 టోర్నమెంట్ రద్దు అవుతుందని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్త బయటకు రావడంతో ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పు కొట్టడం… కలగానే మారుతుందని ప్రచారం కూడా చేశారు.

ఎనిమిది మంది ప్లేయర్లు బెంగళూరుకు దూరం


ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో… ఐపీఎల్ 2025 టోర్నమెంట్ మళ్లీ ప్రారంభమవుతుందని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్లు అలాగే అభిమానులు సంతోషపడ్డారు. మే 17వ తేదీ నుంచి ఐపీఎల్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభమవుతుందని అందరూ సంతోషపడుతున్న నేపథ్యంలోనే మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పై పిడుగు లాంటి వార్త పడింది. ఐపిఎల్ 2025 పున : ప్రారంభం కంటే ముందు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కు ఏకంగా ఎనిమిది మంది ప్లేయర్లు దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లిస్టులో తోపు ప్లేయర్లు ఉన్నారు. మొదటగా విదేశీ ప్లేయర్లను ఒకసారి పరిశీలిస్తే… పిల్ సాల్ట్, లియామ్ లివింగ్ స్టోన్, జాకబ్ బెత్ లే ఈ ముగ్గురు ఇంగ్లాండ్ లోనే ఉన్నారు. ఈ ముగ్గురు వెస్టిండీస్తో జరిగే సిరీస్ ఆడబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే వెస్టిండీస్ ఆటగాడు రొమారియో షెఫర్డ్… కూడా నేషనల్ డ్యూటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తమ సొంత జట్టుకు ఆడే అవకాశాలు ఉన్నాయి. అలాగే టీమ్ డేవిడ్ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియా వెళ్లిన ప్లేయర్ లందరూ మళ్ళీ ఐపీఎల్ ఆడెందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో టీం డేవిడ్ కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంది.జోష్ హేజల్ వుడ్ కూడా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. అతడు రావడం కష్టమే. ఇండియన్ ప్లేయర్ల విషయానికి వస్తే ఇప్పటికే దేవదత్ పడక్కల్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ కు గాయమైంది. అతడు కూడా మూడు మ్యాచ్లకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో.. బెంగళూరు కెప్టెన్ గా.. జితేష్ శర్మ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఇలా స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో… భారం అంతా విరాట్ కోహ్లీ పైన పడింది. అంటే ఈ లెక్కన ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ కావడం కష్టమే అంటున్నారు.

?igsh=YWh5NHBxdmRobWVn

 

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×