BigTV English

IPL 2025: ఆరెంజ్ క్యాప్… ధోని, రోహిత్, రైనాలకు బిగ్ షాక్ ?

IPL 2025: ఆరెంజ్ క్యాప్… ధోని, రోహిత్, రైనాలకు బిగ్ షాక్ ?

IPL 2025:  ఐపీఎల్ ధనాధన్ లీగ్ ( Indian Premier League )  కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వేలం ప్రక్రియ ముగిసింది. సాధారణంగానే ఈ లీగ్ లో బ్యాట్స్మెన్ ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ లీగ్ లో బౌలర్లు సైతం బౌండరీలు బాదుతుంటారు. మరి బ్యాటర్లు ఇంకెంత రెచ్చిపోతారో తెలిసిందే. కాగా, ఐపీఎల్ లో ప్రభావం చూపించిన ఆటగాళ్లను క్యాప్ ఇచ్చి సత్కరిస్తారు. ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ కు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు.


ALSO READ: Virat Kohli – Akashdeep: ఆకాశ్ దీప్ భారీ సిక్సర్.. విరాట్ కోహ్లీ క్రేజీ రియాక్షన్‌!

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు పర్పుల్ క్యాప్ లభిస్తుంది. ఐపీఎల్ చరిత్రలో ( Indian Premier League )
విరాట్ కోహ్లీ ( vIRAT kOHLI), క్రిస్ గేల్  ( Chris Gayle ) మాత్రమే రెండుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. అయితే ఐపీఎల్ లో స్టార్స్ గా ఎదిగిన ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేదట. ఐపీఎల్ లో కెప్టెన్ గా ఓపెనర్ గా రోహిత్ శర్మ రికార్డులు కొల్లగొట్టాడు. ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు.


 

కానీ రోహిత్ ( Rohit Sharma ) ఐపీఎల్ చరిత్రలో ( Indian Premier League ) ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేదు. రోహిత్ శర్మ ( Rohit Sharma ) 257 ఐపీఎల్ మ్యాచ్ లలోనూ 131.14 స్ట్రైక్ రేటుతో 6,628 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 43 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో ధోని కూడా ఉండడం విశేషం. ఎమ్మెస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. ధోని అత్యుత్తమ ఫినిషర్ గా ఎన్నో మ్యాచ్ లను గెలిపించాడు. కానీ ధోని ఒక్కసారి అయినా ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేదు.

 

ధోని 264 ఐపీఎల్ ( Indian Premier League ) మ్యాచుల్లో 137.54 స్ట్రైక్ రేటుతో 5,243 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 24 అర్థ సెంచరీలు సాధించాడు. మిస్టర్ ఐపిఎల్ సురేష్ రైనా చాలా కాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ కోహ్లీ కన్నా ముందు ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులు సృష్టించాడు.

 

ఐపీఎల్ చరిత్రలో  ( Indian Premier League )అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా రైనా తన ఐపీఎల్ కెరియర్ ను ( Indian Premier League ) ముగించాడు. సురేష్ రైనా ( Suresh Raina) ప్లేఆప్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కానీ సురేష్ రైనా ( Suresh Raina) ఒక్క ఆరెంజ్ క్యాప్ ( Orange Cap in IPL ) కూడా గెలుచుకోలేదు. రైనా 205 ఐపీఎల్ మ్యాచ్ లలో 5,528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ALSO READ : Prithvi Shaw: సాయి బాబా.. నేను ఇంకేం చేయాలి.. పృథ్వి షా ఎమోషనల్ పోస్ట్!

Related News

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

Big Stories

×