BigTV English

Narayana Murthy Infosys : 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇంకెన్నాళ్లు – ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

Narayana Murthy Infosys : 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇంకెన్నాళ్లు – ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

Narayana Murthy Infosys : భారత్ లో యువత కష్టపడి పని చేయాలి లేదంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది అని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పటికీ రేషన్ తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉందని గుర్తు చేసిన నారాయమ మూర్తి.. మరి వాళ్లంతా పేదరికంలో ఉన్నట్లేగా అని అన్నారు. అలాంటప్పుడు.. అధిక పని గంటలు పనిచేస్తే తప్పేంటని అన్నారు. దేశంలోన కార్పోరేట్ సంస్థల పని వేళలు కుదించాలనే చర్చ జరిగినప్పుడు.. నారాయణ మూర్తి తీవ్రంగా వ్యతిరేకించారు. కార్పేరట్  సంస్థలకు వారంలో ఐదు రోజుల పని దినాలు చాలనే వాదన సరైంది కాదన్న ఆయన.. ఏకంగా దేశీయ యువత వారానికి 70 గంటల పాటు పని చేయాలని అన్నారు. ఆర్థికంగా అభివృద్ధి సాధించిన పాశ్చాత్య దేశాల సరసన చేరాలంటే ఈ మాత్రం కష్టపడకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీంతో.. ఆయన వ్యాఖ్యలపై విభిన్న వర్గాల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొంత మంది నారాయణ మూర్తి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మాట్లాడితే.. మరికొందరు జీవితం అంటే కేవలం ఉద్యోగం కాదనే విషయాన్ని గుర్తించాలంటూ పోస్టులు చేశారు.


ఇప్పట్లోనే తాను ఇప్పటి తరం ఆలోచనలు ఉన్నవాడిని కాదని, ఎవరెన్ని చెప్పినా తనకు వారానికి 70 గంటల పని దినాలు సరైనదే అనిపిస్తోందని ఓ సందర్భంలో అన్నారు. మళ్లీ ఇప్పుడు తన అభిప్రాయాన్ని సమర్థించుకున్న ఇన్పోసిస్ వ్యవస్థాపకులు.. వారానికి 70 గంటలు పని చేయకపోతే దేశంలో పేదరికం ఎలా అధిగమించగలమంటూ ప్రశ్నించారు.

ప్రస్తుతం రోజుకు 8 గంటల చొప్పున వారానికి ఆరురోజుల పాటు అంటు 48 గంటల పని విధానం దేశంలో అమలవుతోంది. దీనిని కుదించి.. మరిన్ని తక్కువ పని గంటలు అమలు చేయాలనే చర్చ దేశంలో విస్తృతంగా జరిగింది. ఈ విషయంపై మాట్లాడిన నారాయణ మూర్తి.. రోజుకు 10 గంటల చొప్పున వారానికి 70 గంటలు పని చేయాలన్నారు. అప్పుడే.. వ్యక్తిగతాభివృద్ధి, సంస్థలు వృద్ధి పథంలో నడుస్తాయని అంటున్నారు.


ఇటీవల కోల్ కత్తాలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ మూర్తి.. ప్రపంచంలోని అత్యత్తమ సంస్థలతో సరిపోల్చుకోవాలని సూచించారు. ఇన్పోసిస్ ను సైతం అలానే పోల్చి చూస్తామని.. అప్పుడే భారతీయులుగా మనం చేయాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తుందని అన్నారు. ఇందుకు మద్ధతుగా.. దేశంలోని పేదరికాన్ని ప్రస్తావించిన మూర్తి .. ఇప్పటికీ దేశంలో దాాదాపు 80 కోట్ల మంది రేషన్ బియ్యాన్ని అందుకుంటున్నారని గుర్తు చేశారు. అంటే.. వారంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారేగా అని ప్రశ్నించారు.  మరి దేశంలో ఇంత మంది పేదలుంటే.. ఎక్కువ గంటలు పని చేయడంలో తప్పేంటని అన్నారు.

Also Read : ఒకే దేశం – ఒకే ఎన్నిక.. కేంద్రం వాదనేంటి.? ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి.?

దేశ యువతగా.. మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉండాలన్న నారాయణ మూర్తి.. మనం పేదరికాన్ని అధిగమించాలంటే కష్టపడడమే మార్గమని సూచించారు. మనం  కాకపోతే దేశం కోసం ఇంకెవరు కష్టపడతారని ప్రశ్నించారు. ఈ మధ్య మరో కార్యక్రమంలోనూ నారాయణ మూర్తి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువగా ఉందన్న ఆయన..  దేశ యువతే దాన్ని మార్చాలని అన్నారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్న జర్మనీ, జపాన్ దేశాలు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చాలా కష్టపడ్డాయని.. అందుకే వాటికి ఆ హోదా దక్కిందని వ్యాఖ్యానించారు. ఆయా దేశాలను ఆదర్శంగా తీసుకుని.. మనమూ ఎక్కువగా శ్రమించాలంటూ సూచించారు.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×