BigTV English
Advertisement

Tim David: బుమ్రా ఫస్ట్ బాల్ సిక్స్ కొడతాం.. RCB వార్నింగ్ !

Tim David: బుమ్రా ఫస్ట్ బాల్ సిక్స్ కొడతాం.. RCB వార్నింగ్ !

Tim David:  టీమిండియా క్రికెటర్ బుమ్రా బౌలింగ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. బుమ్రా వేసే యార్కర్లకు ప్రత్యర్థులు ఎవరైనా సరే వణుకు పుట్టాల్సిందే. అయితే గాయం కారణంగా బుమ్రా ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లకు అందుబాటులో లేడు. మూడు నెలల తరువాత మైదానంలోకి దిగేందుకు స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా సిద్ధమవుతున్నాడు. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది.  అయితే ముంబై బౌలర్ బుమ్రా బౌలింగ్ ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తామని ఆర్బీసీ ఆటగాడు టిమ్ డేవిడ్ పేర్కొన్నాడు. గత సీజన్ వరకు వీరిద్దరూ ముంబై ఫ్రాంచైజీకే ఆడిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే బుమ్రా పై కామెంట్స్ చేశాడు డేవిడ్.


” జస్ ప్రీత్ బుమ్రా అద్భుతమైన యార్కర్లను అడ్డుకోవడం చాలా కష్టం. గొప్ప జట్ల పై  గొప్ప క్రికెటర్లతో మ్యాచ్ లో నాణ్యమైన క్రికెడ్ ఆడితే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. అత్యుత్తమంతోనే సవాల్ ఉండాలని కోరుకుంటా. ఈ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నా. టోర్నీలో పైకి వెళ్లాలంటే కఠినమైన ప్రత్యర్థులను అధిగమించాల్సిందే. బుమ్రా ఆడుతాడని భావిస్తున్నా. మేము ఎవరు అతడిని ఎదుర్కొన్నా తొలి బంతికే ఫోర్ లేదా సిక్స్ కొట్టేందుకు ప్రయత్నిస్తాం. అతని మళ్లీ మైదానంలోకి దిగడం చాలా ఆనందంగా ఉంది. బుమ్రా రాకతో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారనుంది. మళ్లీ ముంబైకి రావడం బాగుంది. మంచి స్నేహితులున్నారు. ఐపీఎల్ కొత్త సైకిల్ లో ఇదో ఆసక్తికరమైన అనుభవం” అని టిమ్ డేవిడ్ వెల్లడించారు.

ఇక ఐపీఎల్ 18వ సీజన్ లో ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్ లు ఆడింది. కేవలం ఒక్క విజయం మాత్రమే దక్కించుకుంది. ప్లే ఆప్స్ కి అవకాశాలు ఉండాలంటే ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ లో కూడా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం మూడు మ్యాచ్ లు ఆడి.. అందులో రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ 4లో కొనసాగుతోంది. ఇవాళ జరిగే మ్యాచ్ లో గెలిస్తే.. అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఈ సారి కప్ మనదే అని అభిమానుల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఆర్సీబీకి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ – విరాట్ కోహ్లీ ని  ముంబై బౌలర్ బుమ్రా ఎలా ఎదుర్కొంటాడనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారనుంది.


ఇటీవల జరిగిన మ్యాచ్ లో ముంబైని ఆర్సీబీ ఓడించింది. ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ తక్కువ స్కోరే వెనుదిరిగాడు. దీంతో ఆ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. ఆర్సీబీలో టిమ్ డేవిడ్ కీలక బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు. చివర్లో సిక్స్ లతో విరుచుకుపడుతున్నాడు. దీంతో ఆర్సీబీ విజయాల్లో కీలక ఆటగాడిగా మారాడు టిమ్ డేవిడ్. ఓపెనర్లు విఫలం చెందినప్పటికీ టిమ్ డేవిడ్ మాత్రం నిరాశ చెందకుండా పలు కీలక ఇన్నింగ్స్ ఆడటం విశేషం.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×