IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 మ్యాచ్ లో ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య రెండో మ్యాచ్ జరుగనుంది. నిన్న తొలి మ్యాచ్ లో శ్రీలంక కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 14న లీగ్ దశలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. మళ్లీ సరిగ్గా వారం రోజులకు సెప్టెంబర్ 21న సూపర్ 4 దశలో ఇవాళ ఇరు జట్లు మళ్లీ తలపడనున్నాయి. లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కి పోటీ ఇవ్వలేకపోయింది పాకిస్తాన్ జట్టు. మరోవైపు ఓటమి తరువాత పాక్ క్రికెటర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని… పాక్ తీవ్ర అసంతృప్తి ప్రదర్శించడంతో పాటు వివాదానికి తెరలేపింది.
Also Read : SL Vs BAN : శ్రీలంక కి షాక్.. సూపర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం
ఇలాంటి తరుణంలో మళ్లీ దాయాది జట్లు తలపడుతుండటంం.. పోరు మరింత ఆసక్తిని రేకిత్తిస్తోంది. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ కి పాకిస్తాన్ ను మట్టి కరిపించేదుకు టీమిండియా కి చాలా ఈజీ అనే చెప్పవచ్చు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ కనుక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటే.. టీమిండియా ఓడిపోవడం ఖాయం అని కొందరూ క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొన్న ఒమన్ తో విజయం సాధించడంలో భారత్ కింద మీద పడింది. అలాంటి పరిస్థితి పాకిస్తాన్ పై ఎదురైతే..? అనే ప్రశ్నార్థకం కనిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఈ మ్యాచ్ కూడా ఆండీ పైక్రాప్ట్ నే మ్యాచ్ రిఫరీగా ఎంపిక చేసింది ఐసీసీ.
ఒమన్ తో మ్యాచ్ లో ఇద్దరూ భారత కీలక బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిలకు విశ్రాంతిని ఇచ్చింది. వీరిద్దరూ పాకిస్తాన్ మ్యాచ్ కి అందుబాటులో ఉంటారు. పాకిస్తాన్ తో లీగ్ దశలో ఆడిన టీమ్ నే మళ్లీ కొనసాగించనుంది టీమిండియా. అభిషేక్ శర్మ దూకుడును నిలవరించడం పాకిస్తాన్ పెద్ద కష్టమే కావచ్చు. అయితే వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ వరుస మూడు మ్యాచ్ ల్లో విఫలం చెందడంతో జట్టులో కాస్త ఆందోళన కలిగించే అంశం అనే చెప్పవచ్చు. అభిషేక్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే బ్యాటింగ్ పదును కలిసొస్తే.. ఇక టీమిండియాకి తిరుగుండదు. అలాగే బౌలింగ్ లో బుమ్రా, వరుణ్, కుల్దీప్, హార్దిక్ పాండ్యాలు వికెట్లు తీస్తే.. టీమిండియా ఆసియా కప్ 2025 మరోసారి విజయం సాధించినట్టే. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు అంతగా ఫామ్ లో లేదు. టీమిండియాలో శుబ్ మన్ గిల్ విఫలమైనట్టే.. పాకిస్తాన్ లో ఓపెనర్ అయూబ్ ఏకంగా మూడు మ్యాచ్ ల్లో డకౌట్ కావడం గమనార్హం. మొత్తానికి ఇవాళ జరిగే సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ టీమిండియాను ఢీ కొంటుందా..? లేదా అనేది వేచి చూడాలి.