SL Vs BAN : ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 మ్యాచ్ లో శ్రీలంక పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ బ్యాటర్లు సైఫ్ హాసన్, తౌహిద్ హృదయ్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 168/7 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్లు పాథుమ్ నిశాంక 15 బంతుల్లో 22 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండీస్ 25 బంతుల్లో 34 పరుగులు చేశారు. వీరిద్దరూ శ్రీలంకకు మంచి శుభారంభం ఇచ్చారు. మెండీస్ 3 సిక్స్ లు, నిశాంక 1 సిక్స్ తో రెచ్చిపోయారు. ఇక తరువాత వచ్చిన కమిల్ మిశ్రా 5, కుశార్ పెరీరా 16 త్వరగానే ఔట్ అయ్యారు. ఈ దశలో శనక 37 బంతుల్లో 64 పరుగులు చేశాడు.
Also Read : Smriti Mandhana : విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన స్మృతి మంధాన..
అతని ఇన్నింగ్స్ లో 6 సిక్స్ లు, 3 ఫోర్లు, హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. చరిత్ అసలంక 10 బంతుల్లో 21 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజర్ రెహ్మానక్ 3, మెహిదీ హసన్ 2, తస్కిన్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు. దీంతో 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది బంగ్లాదేశ్.. అయితే ఓపెనర్ తాంజిద్ హసన్ నువాన్ తుషార వేసిన తొలి ఓవర్ లో 5వ బంతికే బౌల్డ్ అయ్యాడు. తొలి 5 బంతుల్లో బంగ్లాదేశ్ ఒక్క పరుగు కూడా రాలేదు. కెప్టెన్ లిట్టన్ దాస్ వచ్చి ఆరవ బంతిని సింగిల్ తీసుకొని స్కోర్ ను ప్రారంభించాడు. ముఖ్యంగా మరో ఓపెనర్ సైఫ్ హాసన్ 45 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతనికి తోడు లిట్టన్ దాస్ 16 బంతుల్లో 23, తౌహిద్ హృదయ్ హాఫ్ సెంచరీ చేశాడు. చమీరా వేసిన 19వ ఓవర్ లో తౌహిద్ హృదయ్ (58) పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. చివర్లో షమీమ్ హుస్సెన్, జాకీర్ అలీ కలిసి విజయవంతం చేశారు.
Also Read : Asia Cup 2025 : టీమిండియా నుంచి గిల్ ను తొలగించండి… ఆడుకుంటున్న ఫ్యాన్స్
చివరి ఓవర్ లో 6 బంతుల్లో 5 పరుగులు అవసరం కాగా.. తొలి బంతిని జాకీర్ అలీ 4 కొట్టాడు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. ఆ తరువాత జాకీర్ అలీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4 బంతుల్లో 1 పరుగు చేయాల్సి ఉండగా.. రెండు వరుస డాట్ బాల్స్ వేశాడు శనక. 19.4 ఓవర్ లో శనక మోహిది హాసన్ కుశాల్ మెండీస్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 2 బంతుల్లో 1 పరుగు చేయాల్సి ఉండగా.. నసుమ్ అహ్మద్ సింగ్ తీయడంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార 1, చమీరా 1, హసరంగా 2, శనక 1 వికెట్ తీశాడు. చివరి ఓవర్ లో తొలి ఓవర్ కే 4 కొట్టడంతో బంగ్లాదేశ్ దే విజయం అనుకున్న తరుణంలో వికెట్ కోల్పోవడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. ఆ తరువాత బంగ్లా బ్యాటర్ నసుమ్ అహ్మద్ సింగిల్ తీయడంతో ఉత్కంఠకు తెరపడినట్టు అయింది.