OTT Movie : ఒక్కోసారి చిన్న సినిమాలు సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా అవార్డ్ లను ఎగరేసుకుపోతుంటాయి. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘పార్కింగ్’ సినిమా ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది బాక్స్ ఆఫీస్ లో ఒక సంచలనం అయింది. మూడు నేషనల్ ఫిల్మ్ అవార్డులను కూడా గెలుచుకుంది. బెస్ట్ తమిళ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (భాస్కర్), బెస్ట్ తమిళ స్క్రీన్‌ప్లే (రామ్‌కుమార్) వీటిని అందుకున్నారు. ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. ఈ కథ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Parking’ 2023లో విడుదలైన తమిళ భాషా బ్లాక్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. దీనికి రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. పాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై సుధన్ సుందరం, K.S. సినీష్ నిర్మించారు. ఇందులో హరీష్ కల్యాణ్ (ఈశ్వర్), M.S. భాస్కర్ (ఇళంపరుతి), ఇందుజా రవిచంద్రన్ (ఆతిక), రమా (పరుతి), ప్రథాన నాథన్ (అపర్ణ) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 7 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 7.8/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2023 డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలై, 2023 డిసెంబర్ 30 నుండి Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ చెన్నైలో ఒక డూప్లెక్స్ హౌస్‌లో జరుగుతుంది. ఇక్కడ ఈశ్వర్ 28 ఏళ్ల IT ప్రొఫెషనల్. తన ప్రెగ్నెంట్ భార్య ఆతికతో మొదటి అంతస్తులోకి అద్దెకు వస్తాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇళంపరుతి అనే పంచాయత్ ఆఫీసర్, తన భార్య సెల్వి, కూతురు అపర్ణతో 10 ఏళ్లుగా నివసిస్తున్నాడు. ఇళంపరుతి పాతతరం మనిషి, డబ్బు ఆదా చేసే స్వభావం, ఆధునిక జీవనశైలికి దూరంగా ఉంటాడు. ఈశ్వర్ మాత్రం ఆతిక కోసం ఏదైనా చేసే యంగ్, లవింగ్ హస్బెండ్. మొదట రెండు కుటుంబాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. కానీ ఈశ్వర్ తన భార్య కోసం కొత్త కారు కొని, ఇంటి ముందు ఉన్న ఏకైక పార్కింగ్ స్పాట్‌లో పార్క్ చేయడంతో సమస్య మొదలవుతుంది. ఈ స్పాట్‌ను ఇళంపరుతి 10 ఏళ్లుగా తన బైక్ కోసం వాడుకుంటున్నాడు. దీంతో అతనికి ఈశ్వర్ కారు పార్క్ చేయడం ఇష్టం ఉండదు. ఈ చిన్న విషయం ఈగో క్లాష్‌గా మారుతుంది.
ఈశ్వర్‌ను నొప్పించడానికి ఇళంపరుతి తన బైక్‌ను అమ్మి కారు కొంటాడు. ఇద్దరూ పార్కింగ్ స్పాట్ కోసం క్యాట్-అండ్-మౌస్ గేమ్ ఆడతారు. విషయం ఒక రోజు ఈశ్వర్ కారు విండోను ఇళంపరుతి పగలగొట్టడంతో, ఈశ్వర్ తల్లిని అవమానించడంతో ఉద్రిక్తత పెరుగుతుంది. ఈశ్వర్ ఆవేశంలో ఇళంపరుతిని చెంపదెబ్బ కొడతాడు. ప్రతీకారంగా ఇళంపరుతి తన కూతురు అపర్ణను ఉపయోగించి ఈశ్వర్‌పై ఫాల్స్ హరాస్‌మెంట్ కేసు ఫైల్ చేయిస్తాడు. దీని వల్ల ఈశ్వర్ అరెస్ట్ అవుతాడు. అపర్ణ గిల్టీతో కేసు విత్‌డ్రా చేస్తుంది. ఈశ్వర్ ప్రతీకారంగా ఇళంపరుతిపై లంచం కేసు ఫ్రేమ్ చేసి, అతన్ని సస్పెండ్ చేయిస్తాడు.
ఈ గొడవలో ఆతిక, సెల్వి, అపర్ణ వాళ్లను ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడ ఈగో డామినేట్ చేస్తుంది. క్లైమాక్స్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆతిక కాలు జారి కిందపడుతుంది. పురిటి నొప్పులతో బాధపడుతుంటుంది. ఈ సమయంలో ఇళంపరుతిపై దాడి చేసి గ్యాస్ లీక్ సెటప్ చేస్తాడు ఈశ్వర్ ఈ కథ ఉత్కంఠతో పీక్స్ కి వెళ్తుంది. చివరికి ఆతికకి ఎవరు సహాయం చేస్తారు. గ్యాస్ లీక్ వల్ల ఇళంపరుతికి ప్రమాదం జరుగుతుందా ? పార్కింగ్ సమస్య క్లియర్ అవుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ సినిమాని చూసి తెఊసుకోండి.
Read Also : పెళ్లి చెల్లితో, ఫస్ట్ నైట్ అక్కతో… కట్ చేస్తే బుర్రబద్దలయ్యే ట్విస్టు … ఇదెక్కడి తేడా యవ్వారంరా అయ్యా