Illu Illalu Pillalu Today Episode September 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లికి దొరికిన ఫోటోలను నర్మద తీసుకెళ్లి వేదవతికి చూపిస్తుంది. ఆ ఫోటోలను చూస్తున్నా వేదవతి షాక్ అవుతుంది. ఈ ఫోటోలు ఎక్కడివే.. ఇది మీ మామయ్య కంటపడితే ఇంకా ఏమైనా ఉందా అని నర్మదతో టెన్షన్ పడుతూ మాట్లాడుతుంది. అయితే వీళ్లిద్దరు మాట్లాడుకోవడం విన్న వల్లి అర్థం కాక ఏం జరుగుతుందని జుట్టు పీక్కుంటుంది. అయితే వల్లి ఈ విషయాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటుంది.
అత్తయ్య నర్మదా ఏదో విషయం గురించి టెన్షన్ పడుతున్నారు. ఏంటో కచ్చితంగా కనిపెట్టాలి అని అనుకుంటుంది. రామరాజుకి ఈ విషయం ఎలాగైనా చెప్పాలని కళ్యాణ్ తన ఫ్రెండ్ ని తీసుకుని రామరాజుకి పెన్ డ్రైవ్ ఇవ్వమని చెప్తాడు. మనము ఈ పెన్ డ్రైవ్ ఇస్తే ఆయనే చూసుకుంటాడు మిగతాదంతా అని కళ్యాణ్ అంటాడు. కళ్యాణ్ ఫ్రెండు అనుకున్న విధంగానే ఆ పెన్ డ్రైవ్ ని రామరాజుకు ఇస్తాడు.. ధీరజ్ వచ్చి నిజం తెలియనివ్వకుండా ఆపేస్తాడు. శ్రీవల్లి మాత్రం ఎలాగైన ఈ నిజం తెలిసేలా చెయ్యాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. శ్రీవల్లి కచ్చితంగా ప్రేమను ఇరికించాల్సిందే అని అంటుంది. ఇక ఇంట్లో నర్మదా వేదవతి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ విషయం మీ మావయ్య గారికి ఎట్టి పరిస్థితులను తెలియనివ్వకూడదు అని అనుకుంటారు. ప్రేమ టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. నీ గురించి ఎవరో కాలేజీలో అందరికీ ఫోటోలు పంపిస్తున్నారు నీ పక్కన ఉన్న అబ్బాయి ఫోటో బ్లర్ చేసి కాసేపట్లో రివిల్ అవుతుంది అని చెప్తున్నారు అని ఫ్రెండ్స్ చెప్తారు.
అయితే ప్రేమ ఈ విషయం ఎలాగైనా ధీరజ్తో చెప్పాలని అనుకుంటుంది.. రామరాజు భోజనానికి ఇంటికి వెళ్లాలని అనుకుంటాడు. ప్రేమ టెన్షన్ పడుతూ ఉండడం చూసి ఏమైంది ప్రేమ ఇలా పరిగెడుతుంది ఏంటి అని తిరుపతి తో అంటాడు. దానికి తిరుపతి నీ కోడలితో ఏ రోజైనా నువ్వు ప్రేమగా మాట్లాడావా? ఏమైంది అమ్మ ఎందుకు ఇలా పరిగెడుతున్నావ్ అని అడిగావా నీకు చెప్పడానికి అని సెటైర్లు వేస్తాడు. ఆ తర్వాత ధీరజ్ కూడా పరిగెత్తడం చూసి రామరాజుకు ఏంటి వీళ్లిద్దరూ టెన్షన్ గా పరిగెడుతున్నారు అని అనుమానం వస్తుంది..
ఇక రామరాజు భోజనానికి అన్ని ఇంటికి వస్తాడు.. అయితే నర్మదా వేదవతి మాత్రం ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మావయ్యకు తెలియనివ్వకూడదు అని అనుకుంటారు. ఈ విషయం గురించి బయటపడితే అందరూ దొరికిపోతారు. మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని వేదవతి అంటుంది. నేను చూసుకుంటాను అత్తయ్య మీరు వెళ్లి మావయ్యని తీసుకురండి అని అంటుంది నర్మద.. రామరాజు రావడం చూసినా వేదవతి ఏవండీ వచ్చేసారా అని అడుగుతుంది.
తిరుపతి ప్రతిరోజు బావ ఇంటికి వస్తూనే ఉంటాడు భోజనాలు ఎక్కడ చేస్తాడు ఇంట్లోనే చేస్తారు కదా.. కొత్తగా వచ్చి వచ్చారండి అని అడుగుతున్నావేంటి అక్క అని తిరుపతి అంటాడు. దానికి రామరాజు పెళ్లయితే నీకు తెలుస్తుంది లేరా అని కావాలనే సెటైర్లు వేస్తాడు. ఇంట్లో కూర్చున్న రామరాజు నీ వేదవతి దగ్గరుండి భోజనం వడ్డీస్తుంది. భోజనం తిన్న తర్వాత రామరాజు ఒంటరిగా కూర్చుండటం చూసిన శ్రీవల్లి మావయ్య గారు అండి మీకు ఒక కవర్ వచ్చిందండి అని కావాలనే ప్రేమ కళ్యాణ్ ఫోటోలను తీసుకుని వెళుతుంది.
Also Read:ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..
ఆ ఫోటోలను చూసిన నర్మద వాటిని ఇలా ఇవ్వు ఇలా ఇవ్వు అని లాగేసుకుంటుంది.. అక్కడితో ఆ ఫోటోల కవరు చినిగిపోతుంది. ఫోటోలన్నీ ఇంట్లో చల్లాచెదురుగా పడి ఉంటాయి. ఈ ఫోటోలను చూసినా రామరాజు ఎవరు ఈ అబ్బాయిని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడే కళ్యాణ్ ఫోన్ చేసి నేను మీ చిన్న కోడలు ప్రేమను ప్రేమించాను అని అంటాడు. ఇక శ్రీవల్లి కూడా ఈ ఫోటోలు గురించి రామరాజుకి గుచ్చి గుచ్చి చెప్పేస్తుంది అక్కడితో ప్రోమో పూర్తవుతుంది.. సోమవారం ఏం జరుగుతుందో చూడాలి..