IND Vs PAK : ప్రస్తుతం WCL సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగ్గా ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరగ్గా సౌతాఫ్రికా విజయం సాధిందించింది. ఇక ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఆ మ్యాచ్ మాత్రం జరిగేలా కనిపించడం లేదు. ఎడ్ బాస్టన్ వేదికగా వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టీ-20 టోర్నీలో ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయింది. తీవ్ర విమర్శల వేళ మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇరు దేశాల మధ్య హాకీ, వాలీబాల్ మ్యాచ్ లు జరగడంతో WCL లోనూ ప్లాన్ చేశాం. చాలా మంది ఫీలింగ్స్ ను హర్ట్ చేసినందుకు క్షమించండి అని పేర్కొంది. ఇప్పటికే శిఖర్ ధవన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా ఈ మ్యాచ్ నను బాయ్ కాట్ చేసిన విషయం తెలిసిందే.
ఆ ముగ్గురు ప్లేయర్లు బాయ్ కాట్..
అయితే ఈ ముగ్గురు ప్లేయర్లు మ్యాచ్ ను బాయ్ కాట్ చేశారు. అందుకే WCL మేనేజ్ మెంట్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరగాల్సిన ఇవాళ్టి మ్యాచ్ ని రద్దు చేసింది. టీమిండియా కీలక ఆటగాళ్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ బాయ్ కాట్ చేయడంతో మ్యాచ్ రద్దు అయింది. సోషల్ మీడియాలో ఈ ముగ్గురు ఆటగాళ్ల పై టీమిండియా అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీళ్లు రా మొనగాళ్లూ అంటున్నారు. ఇప్పటికే ఇండియా-పాకిస్తాన్ మధ్య వివాదాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆసియా కప్ సమావేశం ఈనున్న విషయం తెలిసిందే. ఆ సమావేశానికి బీసీసీఐ హాజరు కాలేమని తేల్చి చెప్పింది. దీంతో మరికొందరూ క్రికెట్ అభిమానులు మాత్రం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చూద్దామని అనుకున్నారు. కానీ వారి ఆశలను నెరవేరలేదు.
ఆ మజానే వేరు..
పాకిస్తాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ జరుగుతుంటే కొంత మంది పనులు ఎగ్గొట్టి మరీ చూస్తుంటారు. అలాంటిది ఇవాళ మ్యాచ్ జరుగకపోవడంతో సగం మంది టీమిండియా ఆటగాళ్లను ప్రశంసిస్తుంటే.. మరికొందరూ టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్ ను ఆడి ఉంటే.. పాకిస్తాన్ పై విజయం సాధిస్తే ఆ మజానే వేరు అని కొందరూ పేర్కొంటున్నారు. టీమిండియా యువరాజ్ సారథ్యంలో ఆడనుంది. తొలి సీజన్ ఫైనల్ లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో భారత్ తొలి టైటిల్ సాధించింది. ఇక ఆ మ్యాచ్ తో ఇవాళ పాకిస్తాన్ తో తలపడనుండాల్సి ఉండగా.. ఆ మ్యాచ్ రద్దు అయింది. భారత జట్టు ఈనెల 22న సౌతాఫ్రికా, 26న ఆస్ట్రేలియా, 27న ఇంగ్లాండ్, 29 న వెస్టిండీస్ తో తలపడనుంది. ఆగస్టు 02న WCL ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లో మ్యాచ్ ని రాత్రి 9 గంటల నుంచి జరిగే ప్రతీ మ్యాచ్ ని వీక్షించవచ్చు.
🚨 INDIA Vs PAKISTAN MATCH CALLED OFF IN WCL 🚨
– India Vs Pakistan WCL 2025 Match called off by organisers after Indian players Boycott the Match. (Express Sports). pic.twitter.com/WPFALV6w1O
— Tanuj (@ImTanujSingh) July 20, 2025