Inzamam-ul-Haq On IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 1st Test) మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 720 పరుగులు సాధించి.. న్యూజిలాండ్ జట్టుకు చుక్కలు చూపించింది. అయితే కివీస్ గడ్డపై టీమిండియా భారీ స్కోరు సాధించడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ (Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
విదేశీ గడ్డలపై టీమిండియాకు భారీ స్కోరు చేసే దమ్ము లేదంటూ హేళన చేశాడు. కచ్చితంగా ఏదో కుట్ర జరిగే ఉంటుందని వ్యాఖ్యానించాడు. బీసీసీఐ కుట్రలు చేసి వెల్లింగ్టన్ వేదికగా పిచ్ మార్చేసిందన్నాడు. టీమిండియాకు అనుకూలంగా ఫ్లాట్ పిచ్ ను రెండో రోజు నుంచే ఏర్పాటు చేసినట్టు తనకు అనుమానాలు ఉన్నట్టు సంచలన ఆరోపణలు చేశాడు. కివీస్ గడ్డపై 720 స్కోరు దాటారని చెబితే, టీమిండియాను నమ్మేందుకు ఎవరూ లేరని వ్యాఖ్యానించాడు. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఫ్లాట్ మైదానాలపై మాత్రమే ఆడే టీం ఇండియా… కివీస్ గడ్డపై ఆడడం చాలా విడ్డూరంగా ఉందని ఇంజమామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించాలనే బీసీసీఐ ఈ మ్యాచ్ సందర్భంగా కుట్రలు చేస్తుందని ఆరోపించాడు. అందుకే పిచ్ స్వరూపాన్ని మార్చేశారని బాంబు పేల్చాడు. టీమిండియా బ్యాటర్లు సులభంగా ఆడేలా మైదానాన్ని తయారుచేసినట్టు తనకు అనుమానం వస్తుందని తెలిపాడు. లేకపోతే విదేశీ గడ్డపై టీమిండియా 700కు పైగా స్కోర్ సాధించడం అంటే మామూలు విషయం కాదని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ లోనే ఇద్దరు సెంచరీలు, నలుగురు అర్థ సెంచరీలు చేయడం ఏ మాత్రం నమ్మశక్యంగా లేదంటూ హాట్ కామెంట్స్ చేశాడు. దీనిపై ఐసీసీ వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాడు. దీంతో ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో గిల్ సేన భారీ స్కోరు నమోదు చేసింది. 166 ఓవర్లు ఆడిన టీమిండియా తొమ్మిది వికెట్లు నష్టపోయి 720 పరుగులకు డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో రిషబ్ పంత్ 128 పరుగులు చేయగా 78 పరుగులతో రాణించాడు. మూడో రోజు కేఎల్ రాహుల్ 136 పరుగులు చేయగా పడిక్కల్ 80 పరుగులు సాధించాడు. కెప్టెన్ గిల్ 98 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో 32 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు సాధించింది. మరో 265 పరుగులు వెనుకంజలో ఉంది.