E-Paper
Advertisement

Aus vs Eng Ashes 2025-26 : కొంప‌ముంచిన హెడ్ సెంచ‌రీ, 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినీష్‌.. రూ.17.35 కోట్ల భారీ నష్టం!

Aus vs Eng Ashes 2025-26 : కొంప‌ముంచిన హెడ్ సెంచ‌రీ, 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినీష్‌.. రూ.17.35 కోట్ల భారీ నష్టం!
Advertisement

Aus vs Eng Ashes 2025-26 : యాషెస్ సిరీస్ లో భాగంగా పెర్త్ వేదిక‌లో జ‌రిగిన తొలి టెస్ట్ కేవ‌లం రెండు రోజుల్లోనే ముగియ‌డంతో క్రికెట్ ఆస్ట్రేలియా కి భారీ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మూడు, నాలుగు రోజుల‌కు అమ్మ‌కానికి ఉంచిన టికెట్ ఆదాయం కోల్పోవ‌డంతో దాదాపు రూ.17.35 కోట్ల న‌ష్టం జ‌రిగిన‌ట్టు అంచనా వేశారు. మూడో రోజు టికెట్లు దాదాపు అమ్ముడుపోయిన‌ట్టు స‌మాచారం. మొద‌టి రెండు రోజుల్లోనే ల‌క్ష‌కు పైగా అభిమానులు హాజ‌ర‌య్యారు. త‌రువాత రోజుల ఆదాయం కోల్పోవ‌డం ఆస్ట్రేలియాకి గ‌ట్టి దెబ్బ అని చెప్ప‌వ‌చ్చు. వాస్త‌వానికి నాలుగు, ఐదు రోజులు జ‌ర‌గాల్సిన టెస్ట్ మ్యాచ్ ను కేవ‌లం రెండు రోజుల్లోనే ముగించేయ‌డంతో మ్యాచ్ ని ఎంతో ఆస‌క్తిగా చూడాల‌నుకున్న వారికి నిరాశ త‌ప్పింది. కొంద‌రూ ప్రారంభంలో అంత మ‌జా ఉండ‌ద‌ని.. చివ‌రి రోజుల్లో తాడో, పేడో ఉంటుంద‌ని ఆస‌క్తిక‌న‌బరుస్తుంటారు.

Also Read : Smriti Mandhana Marriage: పూల దండ‌ల‌తో తీన్మార్ డాన్స్ ఇర‌గ‌దీసిన స్మృతి మందాన దంప‌తులు !

అనూహ్యంగా పుంజుకున్న ఆస్ట్రేలియా

Advertisement

మ్యాచ్ ని ఒక‌సారి ప‌రిశీలించిన‌ట్ట‌యితే తొలి ఇన్నింగ్స్ లో ఇరు జ‌ట్లు కూడా క‌నీసం 200 ప‌రుగులు కూడా చేయలేక‌పోయాయి. తొలుత ఇంగ్లండ్ జ‌ట్టు 172 ప‌రుగులు చేయ‌గా.. ఆ త‌రువాత 164 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. కానీ ఆస్ట్రేలియా జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 132 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఒక ద‌శ‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు ఓట‌మి పాల‌వుతుంద‌ని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్ లో పుంజుకొని టార్గెట్ ని ఛేదించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా కీల‌క ఆట‌గాడు ట్రావిస్ హెడ్ సునాయ‌సంగా సెంచ‌రీ చేశాడు. టెస్ట్ మ్యాచ్ ని టీ-20 త‌ర‌హాలో ఆడుతూ బౌల‌ర్ల పై విరుచుకుప‌డ్డాడు. దీంతో 205 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా జ‌ట్టు విజ‌యం సాధించింది. మ్యాచ్ విజ‌యానికి కేవ‌లం 13 ప‌రుగులు చేయాల్సిన స‌మ‌యంలో ట్రావిస్ హెడ్ ఔట్ అయ్యాడు. ఆ త‌రువాత స్టీవెన్ స్మిత్, ల‌బుషేన్ ఫినిష్ చేశారు.

ఇంగ్లండ్ ని ఉతికి ఆరేసిన హెడ్..

ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ తో పాటు ల‌బూషేన్ 51 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా జ‌ట్టు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 205 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కంగారులు కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించారు. ఆసిస్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ కీల‌క మ్యాచ్ లో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడ‌టంతో విజ‌యం సులువు అయింది. ముఖ్యంగా ల‌క్ష్య ఛేద‌న‌లో ఇంగ్లండ్ జ‌ట్టు బౌల‌ర్ల‌ను హెడ్ ఉతికి ఆరేశాడ‌నే చెప్ప‌వ‌చ్చు. టీ-20 త‌ర‌హాలో బ్యాటింగ్ చేశాడు హెడ్. కేవ‌లం 69 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. ఓవ‌రాల్ గా 83 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 16 ఫోర్లు, 4 సిక్స్ ల‌తో 123 ప‌రుగులు చేశాడు. అత‌నితో పాటు మార్న‌స్ ల‌బుషేన్ (51) నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో బ్రైడ‌న్ కార్స్ ఒక్క‌డే రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌రోవైపు ఆస్ట్రేలియా కీల‌క బౌల‌ర్ మిచెల్ స్టార్క్ రెండు ఇన్నింగ్స్ లో క‌లిపి 10 వికెట్లు తీయ‌డంతో అత‌నికే ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. డిసెంబ‌ర్ 04 నుంచి గ‌బ్బా వేదిక‌గా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.

Advertisement

Also Read : Vaibhav Suryavanshi: వివాదంలో 14 ఏళ్ల వైభ‌వ్‌…టీమిండియా కెప్టెన్ పెద్ద ఎద‌వా అంటూ !

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×