BigTV English

Travis Head: దిగివచ్చిన హెడ్…వేలుపెట్టడం వెనుక అసలు కారణం ఇదేనట ?

Travis Head: దిగివచ్చిన హెడ్…వేలుపెట్టడం వెనుక అసలు కారణం ఇదేనట ?

Travis Head: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ వివాదంగా మారింది. దీనంతటికీ కారణం… ఆస్ట్రేలియా డేంజర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ( Travis Head). టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను టార్గెట్ చేసి… దారుణంగా అతన్ని ట్రోలింగ్ చేశాడు హెడ్. బాక్సింగ్ డే టెస్టు చివరి రోజున రిషబ్ పంత్ వికెట్ తీశాడు ట్రావిస్ హెడ్. అతని బౌలింగ్ లోనే పంత్ అవుట్ కావడం జరిగింది. హెడ్ బౌలింగ్లో పంత్ భారీ షాట్ ఆడబోయి… క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.


అయితే రిషబ్ పంత్ అవుట్ కాగానే… అసభ్యకరమైన సిగ్నల్స్ ఇస్తూ… సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్. పాయింట్ అవుట్ ఫింగర్… తన లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకొని… రచ్చ చేశాడు. అయితే… దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్లు సీరియస్ అవుతున్నారు. కేవలం రిషబ్ పంత్ ను హెడ్ అవమానించలేదని… భారతదేశానికి సంబంధించిన 150 కోట్ల జనాలను కూడా హెడ్ అవమానించినాడని… మాజీ క్రికెటర్ సిద్దు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Rohit Sharma – Virat – Bumrah: క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోనున్న రోహిత్, కోహ్లీ.. బుమ్రా కూడా?


వెంటనే ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ పై చర్యలు తీసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి అలాగే ఐసీసీ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేశాడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఈ సంఘటనపై వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ స్పందించి…. అతనిపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే… ఈ వివాదంపై ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించడం జరిగింది. హెడ్ తనకు సంబంధించిన సెలబ్రేషన్స్ అన్ని అలాగే చేస్తాడని.. ఇందులో కొత్త ఏమీ లేదన్నట్లుగా ఆస్ట్రేలియా కెప్టెన్ బదులిచ్చాడు.

అయినప్పటికీ ఈ వివాదం ఎక్కడ కూడా సమస్య పోలేదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా… హెడ్ స్పందించడం జరిగింది. వేలు పెట్టి తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని… అది నాకు సంబంధించిన సెలెబ్రేషన్ అంటూ బదులిచ్చాడు హెడ్. ఐస్ లో వేలు పెట్టడం అనే సెలబ్రేషన్… రిషబ్ పంత్ కోసం ప్రత్యేకంగా నేను చేసుకోలేదు. అది ఎప్పటి నుంచో నేను చేసుకుంటున్నాను. ఇది కొత్త కాదు. అలాంటి సెలబ్రేషన్ నేను శ్రీలంక టూర్ లోనే ప్రారంభించాను. అలా వేలు పెడితే… మరో వికెట్ తీయబోతున్నట్లు.. సిగ్నల్ ఇస్తున్నానని అర్థం అంటూ చెప్పుకొచ్చాడు ట్రావిస్ హెడ్.

 

ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఓ పోస్ట్ పెట్టాడు ఆస్ట్రేలియా డేంజర్ బ్యాటర్ హెడ్. ఓ గ్లాసులో ఐసు ముక్కలు వేసి… అందులో వేలు పెట్టి మరి ఫోటోను షేర్ చేశాడు హెడ్. అతనిపై తీవ్రంగా ఇండియాలో వ్యతిరేకత రావడం, సోషల్ మీడియాలో కూడా హెడ్ ను టార్గెట్ చేయడం జరిగింది. అయితే దీంతో వెంటనే ఈ వివాదం పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు హెడ్. ఒకవేళ ఇదే వివాదం కొనసాగితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో తనకు చేదు అనుభవం ఎదురయ్యే ప్రమాదం ఉందని ముందే గ్రహించాడట హెడ్. అందుకే ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టి…. రిషబ్ పంత్ ను తాను అనలేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మరి దీనిపై టీమిండియా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×