Rohit Sharma – Virat – Bumrah: క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని రోహిత్ శర్మ ( Rohit Sharma ) అలాగే విరాట్ కోహ్లీ పై ( Virat Kohli ) తీవ్ర ఒత్తిడి వస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఈ ఇద్దరు ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించి… యంగ్ స్టార్లకు అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Oshane Thomas: ఎవర్రా వీడు.. ఒక్క బంతికే 15 పరుగులు..?
కొన్ని రోజులపాటు క్రికెట్కు విరామం ప్రకటించాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే కొత్త సంవత్సరంలో జరిగే ఇంగ్లాండ్ సిరీస్ కు దూరం కాబోతున్నారట ఈ ఇద్దరు ప్లేయర్లు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( 2025 ICC Champions Trophy ) మరో 50 రోజుల్లో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( 2025 ICC Champions Trophy ) కంటే ముందు ఫిబ్రవరి మాసంలో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడనుంది టీం ఇండియా.
అందుకే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ కూడా రెస్ట్ తీసుకోబోతున్నారట. ఈ ఇద్దరు ప్లేయర్లతో పాటు టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా ( Bumrah ) కూడా రెస్ట్ మూడు లోకి వెళ్ళనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 40 రోజుల పాటు రెస్టు తీసుకుంటేనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో ఈ ముగ్గురు ప్లేయర్లు… బాగా ఆడతారని భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Bcci ) అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారట.
Also Read: Nitish Kumar – Bumrah: MCG లో నితీష్, బుమ్రాకు అరుదైన గౌరవం.. వీడియో వైరల్ !
2024 సంవత్సరంలో ఈ ముగ్గురు ప్లేయర్లపై వర్క్ లోడ్ ఎక్కువైన సంగతి తెలిసిందే. అయితే ఈ వర్క్ లోడ్ కారణంగా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడిస్తే… టీమిండియా కు పెను ప్రమాదం పొంచి ఉండే ఛాన్స్ ఉన్నట్లు గ్రహించారట. అందుకే ఈ ముగ్గురు ప్లేయర్లను పక్కకు పెట్టి యంగ్ స్టార్ లకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాను వన్డే జట్టులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారట. కె ఎల్ రాహుల్ కు లేదా రిషబ్ పంతుకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట.
ఇది ఇలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( 2025 ICC Champions Trophy ) ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది…. ముఖ్యంగా టీమిండియా మ్యాచ్ ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్ తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాకిస్తాన్ తో ఫిబ్రవరి 23వ తేదీన దుబాయ్ వేదికగా మొదటి మ్యాచ్ ఉంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( 2025 ICC Champions Trophy ) పాకిస్తాన్ నిర్వహిస్తున్నప్పటికీ హైబ్రిడ్ మోడల్ లో జరగనుంది.
As per reports, Jasprit Bumrah will be rested to manage his workload ahead of the 2025 Champions Trophy, while Rohit Sharma and Virat Kohli will be taking leave.#ChampionsTrophy2025 #JaspritBumrah #RohitSharma #ViratKohli #CricketTwitter pic.twitter.com/LHRD4CsLor
— InsideSport (@InsideSportIND) December 31, 2024