E-Paper
Advertisement

Singaporeopen 2024 Treesa- Gayatri stun WR2: సింగపూర్ ఓపెన్‌లో సంచలనం, ప్రపంచ నెంబర్ 2కు గాయత్రి జోడి షాక్

Singaporeopen 2024 Treesa- Gayatri stun WR2: సింగపూర్ ఓపెన్‌లో సంచలనం, ప్రపంచ నెంబర్ 2కు గాయత్రి జోడి షాక్
Advertisement

Singaporeopen 2024 Treesa- Gayatri stun WR2: సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో సంచలనం నమోదయ్యింది. మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కి చెందిన గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడి, ప్రపంచ రెండో ర్యాంక్ జంటకు షాకిచ్చింది. దీంతో గాయత్రి జోడి క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. భారత డబుల్స్ జోడి గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడి 30వ ర్యాంక్‌లో ఉన్నారు.

గురువారం మధ్యాహ్నం గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడి, కొరియాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంక్ ప్లేయర్ బేక్ హా నా- లీసో హీ మధ్య పోరు సాగింది. ఇరువురు ఆటగాళ్లు నువ్వానేనా అన్నరీతిలో తలపడ్డారు. దాదాపు గంటపాటు మ్యాచ్ సాగడం విశేషం. తొలిసెట్‌ను కేవలం ప్రత్యర్థికి 9 పాయింట్లు మాత్రమే ఇచ్చింది గాయత్రి జోడి. సెకండ్ సెట్‌లో భారత్ జోడి ప్రతిఘటించినప్పటికీ పరాభవం తప్పలేదు.

Advertisement

దీంతో మూడో సెట్ ఇరువురు ఆటగాళ్లకు కీలకంగా మారింది. ఫస్టాప్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన గాయత్రి జోడి, చివరకు వరకు అదే స్పీడ్ కొనసాగించింది. చివరకు 21-9, 14-21, 21-15 తేడాతో విజయం సాధించి క్వార్టర్‌లో అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభం నుంచి ఇప్పటివరకు సంచలనం నమోదు కావడం ఇదే తొలిసారి. క్వార్టర్స్‌లో కొరియాకు చెందిన మరో జంట కిమ్ యుయాంగ్-కాంగ్ యాంగ్‌తో గాయత్రి జోడి తలపడబోతోంది. ఇక్కడ గెలిస్తే పతకం ఖాయం.

మహిళల సింగల్స్ విభాగంలో పీవీ సింధుకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో సింధు- స్పెయిన్‌కు చెందిన కరోలినా మారీన్‌ చేతిలో ఓటమి పాలైంది. వీరిద్ధరి మధ్య ఆరు మ్యాచ్ జరగ్గా అన్నింటిలోనూ సింధు ఓడిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌ ఫైనల్‌లో వీరిద్దరు తలపడ్డారు.

Advertisement

ALSO READ:  కొత్త జెర్సీతో మెరిసిన.. టీమ్ ఇండియా

ఇక పురుషుల సింగల్స్‌లో భారత స్టార్ ఆటగాడు ప్రణయ్ ఓటమి పాలయ్యాడు. ప్రి క్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన కెంటా నిషిమొటో చేతిలో ఓడిపోయాడు. 13-21, 21-14, 15-21 తేడాతో టోర్నీ నుంచి వెనుదిరిగాడు. ఇటు సింధు, అటు ప్రణయ్ ఈ టోర్నీలో పెద్దగా ప్రభావం చూపలేదు.

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×