BigTV English

Nithiin – Thammudu: నితిన్ ‘తమ్ముడు’ కోసం కేజీఎఫ్ ఫైట్ మాస్టర్.. పెద్ద ప్లానే ఇది

Nithiin – Thammudu: నితిన్ ‘తమ్ముడు’ కోసం కేజీఎఫ్ ఫైట్ మాస్టర్.. పెద్ద ప్లానే ఇది

Nithiin Thammudu Action Schedule Choreographed By Vikram Mor Of Kgf Fame: యంగ్ హీరో నితిన్ హిట్టు కొట్టి చాలా కాలమైంది బాసు. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు చేశాడు. కానీ అవన్నీ ఎలాంటి ఫలితాలు అందించలేదు. బాక్సాఫీసు వద్ద నిరాశే మిగిల్చాయి. అయినా నితిన్ మాత్రం ఎప్పుడూ తన సహనాన్ని కోల్పోలేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు తనకంటూ ఓ టైం వస్తుందని వెయిట్ చేస్తున్నాడు. అందువల్లనే విజయపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.


గతేడాది మంచి అంచనాలతో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ వచ్చింది. కానీ అది కూడా నిరాశే మిగిల్చింది. మరి దీంతో నితిన్ ఒక్కటే ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. ఈ సారి బడా డైరెక్టర్‌తో చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ తరుణంలోనే మిడిల్ క్లాస్ అబ్బాయి, వకీల్ సాబ్ చిత్రాలకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్‌తో ఇప్పుడొక మూవీ చేస్తున్నాడు.

ఆ మూవీకి ‘తమ్ముడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ ఈ సారి నితిన్‌కు మంచి హిట్ అందిస్తుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మంగా రూపొందిస్తున్నాడు. స్పెషల్ యాక్షన్‌ సీక్వెన్స్‌లు డిజైన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: నితిన్ ‘తమ్ముడు’కి జోడీ దొరికేసిందోచ్.. ఓవర్‌నైట్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిన బ్యూటీ!

అయితే ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా చిత్రీకరణ కోసం మేకర్స్ దాదాపు కోటి రూపాయలతో ఓ స్పెషల్ సెట్ నిర్మించారని.. అందులో నితిన్ లేకుండా మిగతా ఆర్టిస్టులతో 7 రోజుల పాటు ఫైట్ సీక్వెన్స్‌లు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫైట్ సీక్వెన్స్‌లు తెరకెక్కించేందుకు నితిన్ కోసం బడా ఫైట్ మాస్టర్లే దిగుతున్నారు.

కేజీఎఫ్ 1, కాంతార వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఫైట్ సీక్వెన్స్‌లు అందించిన ప్రముఖ ఫైట్ మాస్టర్ విక్రమ్ మోర్ ఈ చిత్రానికి కూడా ఫైట్ మాస్టర్‌గా చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీనిబట్టి చూస్తే నితిన్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం అవుతుంది. చూడాలి మరి రిలీజ్ తర్వాత ఈ మూవీ టాక్ ఏంటో..

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×