U19 Asia Cup 2025 Final: ఆసియా కప్ అండర్ 19 2025 టోర్నమెంట్ లో ( ACC Mens U19 Asia Cup 2025 ) భాగంగా ఇవాళ ఫైనల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో అండర్ 19 టీమిండియా, అండర్ 19 పాకిస్తాన్ జట్లు ( India U19 vs Pakistan U19, Final ) తలపడుతున్నాయి. దుబాయిలోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో ( ICC Academy Ground, Dubai) జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని టీమిండియా నిర్ణయం తీసుకుంది. ఈ ఫైనల్ లో మొదట పాకిస్తాన్ బ్యాటింగ్ చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే మొదట బ్యాటింగ్ చేసిన అండర్ 19 పాకిస్తాన్ జట్టు భారీ స్కోరు సాధించింది. నిర్విత 50 ఓవర్లు ఆడిన పాకిస్తాన్ అండర్ 19 జట్టు, ఎనిమిది వికెట్లు నష్టపోయి 347 పరుగులు సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో 348 పరుగులు సాధిస్తే అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంటును టీం ఇండియా గెలుచుకోనుంది. ఒకవేళ టీమ్ ఇండియా ఓడిపోతే పాకిస్తాన్ ఛాంపియన్ కావడం గ్యారెంటీ.
Also Read: T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే టీమిండియా జట్టు ఇదే
ఆసియా క ప్ అండర్ 19 ప్రపంచక 2025 టోర్నమెంట్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 50 ఓవర్లలో ఎనిమిది టికెట్లు నష్టపోయి 347 పరుగులు సాధించింది. పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన ఓపెనర్ సమీర్ మినహాస్ సెంచరీ తో రెచ్చిపోయాడు. 113 బంతుల్లో 172 పరుగులు సాధించి దుమ్ము లేపాడు. ఇందులో 9 సిక్సర్లతో పాటు 17 బౌండరీలు ఉన్నాయి. 1502.21 స్ట్రైక్ రేట్ తో సమీర్ దుమ్ము లేపాడు. అటు ఉస్మాన్ ఖాన్ 35 పరుగులు సాధించగా అహ్మద్ హుస్సేన్ 56 పరుగులతో రాణించాడు. పాకిస్తాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ అలాగే మిగిలిన క్రికెటర్లు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కేవలం హుస్సేన్ ఆదుకోవడంతో పాకిస్తాన్ భారీ స్కోరు సాధించగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్తాన్ విధించిన 347 పరుగులను చేదిస్తే ఛాంపియన్గా టీమిండియా నిల్వనుంది. లేకపోతే పాకిస్తాన్ ముందు మన ఇండియా జట్టు పరువు పోవడం గ్యారెంటీ అంటున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం ఉన్న టీమిండియా ఫామ్ ప్రకారం మనోళ్లు గెలవడం గ్యారెంటీ అంటున్నారు.
Also Read: Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు పెద్దగా రాణించలేదు. విరివిగా పరుగులు ఇచ్చారు. దీపేష్ దేవేంద్రన్ ఒక్కడే 10 ఓవర్లు వేసి ఏకంగా 83 పరుగులు సమర్పించుకున్నాడు. అదే సమయంలో మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. అలాగే హెనీల్ పటేల్ 10 ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసి ఏకంగా 62 పరుగులు ఇచ్చేశాడు. ఇటు కిలాన్ పటేల్ 10 ఓవర్లు వేసి పొదుపుగా పరుగులు ఇచ్చాడు. అంతే కాదు రెండు కీలక వికెట్లు కూడా పడగొట్టాడు. కనిష్క్ చౌహన్ 10 ఓవర్లు పోసి ఏకంగా 72 పరుగులు ఇచ్చేశాడు. కేవలం ఒక వికెట్ తీసుకున్నాడు. కిసాన్ కుమార్ సింగ్ 5 ఓవర్లు వేసి 50 పరుగులు ధారాళంగా ఇచ్చాడు.