BigTV English

Umran Malik set a new record : బుమ్రా రికార్డు బద్దలు.. ఉమ్రాన్‌ మాలిక్‌దే ఫాస్టెస్ట్‌ బాల్‌..

Umran Malik set a new record : బుమ్రా రికార్డు బద్దలు.. ఉమ్రాన్‌ మాలిక్‌దే ఫాస్టెస్ట్‌ బాల్‌..

Umran Malik set a new record:టీమిండియా యువ పేస్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. గతంలో ఏ భారత ఫాస్ట్ బౌలర్‌కూ సాధ్యం కాని వేగంతో బంతి విసిరి… భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ-20లో 17వ ఓవర్ నాలుగో బంతిని 155 కిలోమీటర్ల వేగంతో వేశాడు… ఉమ్రాన్ మాలిక్. ఆ బంతికి వికెట్ కూడా దక్కింది. శ్రీలంక కెప్టెన్ శనక… అత్యంత వేగవంతమైన ఆ బంతిని ఆడి… చాహల్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన ఉమ్రాన్… 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.


ఉమ్రాన్ కన్నా ముందు భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతి విసిరిన రికార్డు జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది. 153.36 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు… బుమ్రా. ఇప్పుడా రికార్డును ఉమ్రాన్ తుడిచిపెట్టేశాడు. బుమ్రా తర్వాతి స్థానంలో 153.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరిన బౌలర్‌గా షమి, 152.85 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరిన బౌలర్‌గా నవదీప్ సైని… మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

దేశవాళీ టోర్నీల్లోనూ వేగవంతమైన బంతులు విసిరి ప్రత్యర్థి జట్ల బ్యాటర్లకు చుక్కలు చూపించాడు… ఉమ్రాన్‌ మాలిక్‌. కెరీర్‌ ఆరంభంలో వేగంపైనే దృష్టి పెట్టిన ఉమ్రాన్… ఇప్పుడు సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తున్నాడు. అత్యుత్తమంగా బౌలింగ్‌ చేయడంపైనే తాను దృష్టి సారిస్తానని, ఒకవేళ అదృష్టం కలిసి వస్తే మాత్రం అత్యంత వేగవంతమైన బంతి వేసిన అక్తర్‌ రికార్డును కూడా బద్దలు కొడతానని… శ్రీలంకతో టీ-20 సిరీస్‌కు ముందు ఉమ్రాన్ ధీమా వ్యక్తం చేశాడు. చెప్పినట్టుగానే భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా రికార్డు అందుకున్నాడు. అక్తర్ వేగాన్ని అందుకోడానికి మరో 6.3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాడు… ఉమ్రాన్. ఆ కాస్త వేగాన్ని కూడా అందుకుంటే… అంతర్జాతీయ క్రికెట్‌లో 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరిన ఏకైక బౌలర్‌గా అక్తర్‌ నెలకొల్పిన రికార్డును కూడా ఉమ్రాన్ అధిగమించడం ఖాయం.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×