Big Stories

Under-19 World Cup Ind Vs SA 2024: అండర్ 19 ప్రపంచ కప్ సెమీఫైనల్.. ఫేవరెట్ గా టీమ్ ఇండియా..!

under 19 world cup 2024

Under 19 world cup 2024: India Vs South Africa LIVE Score Card:

అండర్ 19 ప్రపంచ కప్ లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ మంగళవారం జరగనుంది. సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్ లో ఫేవరెట్ గా టీమ్ ఇండియా బరిలో దిగుతుంది. ఇంతవరకు ఈ టోర్నమెంటులో ఓటమి అన్నది ఎరుగని టీమ్ ఇండియా మరి కీలకమైన మ్యాచ్ లో విజయం సాధిస్తుందా? సీనియర్లలా తడబడుతుందా? అనేది చూడాల్సిందే.

డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తోంది. బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. 18 ఏళ్ల ముషీర్ ఖాన్ ఇప్పటికి రెండు సెంచరీలు, ఒక ఆఫ్ సెంచరీ చేసి 334 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. కెప్టెన్ ఉదయ్ సహరన్ సెంచరీలు చేయలేదు గానీ 304 పరుగులు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. యావరేజ్ గా పరుగులు చేస్తూ జట్టుకి వెన్నుముకగా నిలుస్తున్నాడు. అవతల ఎండ్ లో పరుగులు చేస్తున్న బ్యాటర్లకి సపోర్ట్ గా నిలుస్తున్నాడు.

నేపాల్ తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో సచిన్ దాస్ 116  సెంచరీ చేశాడు. తెలుగువాడు వికెట్ కీపర్ అవనీష్ రావు తన పరిధిలో చక్కగా ఆడుతున్నాడు. చివర్లో వెళ్లి ఫటాఫట్ ఆడి వస్తున్నాడు. ఎందుకంటే తనకన్నా ముందుగా వెళ్లేవాళ్లు బ్రహ్మాండంగా ఆడుతుండేసరికి తనకి అవకాశం పెద్దగా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో చివర్లో స్కోరు పెంచే బాధ్యత తనపై పడుతోంది. ఈ క్రమంలో త్వరగా అవుట్ అయిపోతున్నాడు. అయితే కీపింగ్ లో మంచి ప్రతిభ చూపిస్తున్నాడు.

బౌలర్లలో వైస్ కెప్టెన్ సౌమి కుమార్ పాండే అద్భుతంగా రాణిస్తున్నాడు.  2.17 ఎకానమీ రేట్ తో 16 వికెట్లు పడగొట్టాడు. రాబోవు రోజుల్లో సీనియర్ల జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. పేసర్లు నమన్ తివారి, రాజ్ లింబానీ కూడా రాణిస్తున్నారు. ఇంత పకడ్బందీగా కనిపిస్తున్న టీమ్ ఇండియాను ఎదుర్కోవడం దక్షిణాఫ్రికాకు చాలా కష్టమైన పని అని చెప్పాలి.

దాయాది పాకిస్తాన్ కూడా సెమీఫైనల్ కి చేరుకుంది. ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఒకవేళ పాక్ గానీ ఫైనల్ చేరితే మరో రసవత్తరమైన మ్యాచ్ త్వరలోనే ఎదురయ్యే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి

Latest News