MS Dhoni Unseen Pic : చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా ధనాధన్ బాదుడే అతని స్ట్రైల్. జార్ఖండ్ డైనమైట్ ఇండియన్ క్రికెట్ ని మలుపు తిప్పిన కెప్టెన్ ధోనీ. పదహారేళ్ల సుదీర్ఘ జర్నీలో భారత్ కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. ఎం.ఎస్. ధోని (MS Dhoni) తన కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మూమెంట్ ఇది. అదే ఏడాది మొదట్లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో అత్యంత అవమానంగా ఓడిన భారత్‌ను.. టీ20 తొలి వరల్డ్‌కప్‌లో గెలిపించి ఒక్కసారిగా నేషనల్ హీరోగా నిలిచాడు. ఆతర్వాత కెప్టెన్‌గా వెనుదిరిగి చూడలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరైన ధోనీ ఇప్పటికీ ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు.
Also Read : RCB fans: ఎంతకు తెగించార్రా… ధోనిపై చెప్పులతో RCB ఫ్యాన్స్ దాడి !
ఎం.ఎస్. ధోనీ టిక్కెట్ కలెక్టర్‌గా పనిచేసేవాడు. 2001 నుండి 2003 వరకు, అతను ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ గా పనిచేసేవాడు. ఇది రైల్వే టిక్కెట్ కలెక్టర్‌తో సమానం. ధోనీ తనను తాను ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మార్చుకోవడానికి రైల్వే ఉద్యోగం వదిలేసాడు. ధోనీ టిక్కెట్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో, అతను దులీప్ ట్రోఫీలో తూర్పు జోన్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు. ఎం.ఎస్. ధోనీ టిక్కెట్ కలెక్టర్‌గా పని చేసిన కాలం అతని కెరీర్‌లో ఒక కీలకమైన దశ అని చెప్పవచ్చు. అయితే ధోనీ టికెట్ కలెక్టర్ గా పని చేసే సమయంలో పలువురు ప్రయాణికులతో ఫొటోలు దిగాడు. అయితే అప్పటి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈసీజన్ లో చెన్నై జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 10వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి స్థానంలో ఉంది. ఇక ముంబై లేదా గుజరాత్ జట్టులలో ఏ జట్టు విజయం సాధిస్తే.. ఆ జట్టు మొదటి ప్లేస్ కి వెళ్లే అవకాశం లేకపోలేదు. ప్రతీ సీజన్ లో ప్లే ఆప్స్ కి చేరే చెన్నై గత సీజన్ లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఈ సీజన్ లో కూడా చెన్నై ఆల్మోస్ట్ ఇంటిబాట పట్టినట్టే. 11 మ్యాచ్ ల్లో కేవలం 2 మ్యాచ్ ల్లోనే విజయం సాధించడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్తితి కూడా అలాంటిదే.
ఇప్పుడు సోషల్ మీడియాలో మహేంద్ర సింగ్ ధోనీ తొలి ఉద్యోగ నియామక లేఖ చక్కర్లు కొడుతోంది. దానిని చూసిన క్రికెట్ అభిమానులు సైతం తెగ షేర్ చేస్తున్నారు. టికెట్ కలెక్టర్ గా పని చేసిన ఆయన ఆ తరువాత తన కలను నెరవేర్చుకునేందుకు ఉద్యోగం వదిలి బ్యాట్ పట్టారు. ఆ తరువాత ఎన్నో రికార్డులు సాధించి సక్సెస్ పుల్ కెప్టెన్ గా ఎదిగారు. ప్రపంచంలోనే మేటీ క్రికెటర్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.
?igsh=MXIzdzIzbWUzOXljOA==