BigTV English

Vinesh Phogat: వినేశ్ విషయంలో.. న్యాయం గెలుస్తుందా?

Vinesh Phogat: వినేశ్ విషయంలో.. న్యాయం గెలుస్తుందా?

Vinesh Phogat’s Olympic Disqualification Will Justice Prevail: వినేశ్ ఫోగట్.. భారత రెజ్లర్.. పారిస్ ఒలింపిక్స్ దురదృష్టవంతురాలు. ఇప్పుడు తను న్యాయం కోసం కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ వైపు చూస్తోంది. అయితే తీర్పు చెప్పేదైతే వెంటనే చెప్పేయవచ్చు. ఇందులో న్యాయపరమైన అంశాలు ఉండటం వల్ల, జడ్జిలు కూడా ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. అందుకే వాయిదా వేశారని అంటున్నారు. వినేశ్ ఫోగట్ చెప్పే వాదనలో న్యాయం ఉందని చాలామంది న్యాయవాదులు పేర్కొంటున్నారు.


ఇక్కడ రెండు విషయాలు వినేశ్ ఫోగట్ వైపు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. ఒకటేమిటంటే రెజ్లర్ల విషయంలో బరువు అనేది ఆరోగ్యంతో కూడుకున్న పెద్ద సమస్యని అంటున్నారు. ఎందుకంటే రెజ్లర్లు కుస్తీ పట్లు పట్టాల్సి ఉంటుంది. అందుకు వారికి బలవర్థకమైన పదార్థాలు, ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒక బౌట్ తర్వాత మరొక దానికి సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పెడుతుంటే, వీరు అలసిపోతుంటారు. రెండు బరువు అటూ, ఇటూగా అవుతుంటుంది. అప్పుడు పోటీ కోసం సన్నద్ధమవ్వాలంటే మితాహారం తింటే సరిపోదని రెజ్లర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగు ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ ఫైనల్ కి చేరుకుంది. ఇక్కడ గెలిచి ఉంటే స్వర్ణం వచ్చేది. లేదంటే రజతం వచ్చేది. ఇప్పుడు 100 గ్రాములు కారణం చూపి, మొత్తం తనని డిస్ క్వాలిఫై చేసేశారు. దీంతో రచ్చ రచ్చ అయ్యింది.


విషయం ఏమిటంటే స్వల్ప వ్యవధిలో బౌట్లలో పాల్గొంటే, ఆ 100 గ్రాములు తగ్గించుకునే అవకాశం రెజ్లర్లకి ఉండదు. అదొక కారణంగా వినేశ్ ఫోగట్ న్యాయవాదులు చెబుతున్నారు. రూల్స్ .. రూల్స్ అంటూ రూల్స్ పట్టుకు వేలాడితే, ఆ రూల్స్ కి తగినట్టుగానే బౌట్స్ ఏర్పాటు చేయాలి కదా.. అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మీ ఇష్టం వచ్చినట్టు బౌట్లు పెట్టి, కుస్తీలు పట్టండి అంటే, అదెలా సాధ్యమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇకపోతే.. రెజ్లింగ్ పోటీలు జరిగే వేదికకు, ఆమె ఉండే క్రీడా గ్రామానికి చాలా దూరం ఉండటం వల్ల ముందే బయలుదేరడం కూడా ఒక కారణమని అంటున్నారు. అందువల్ల తనకి ఎక్సర్ సైజ్ లు చేసే సమయం తక్కువగా ఉందని అంటున్నారు. లేదంటే ఆ 100 గ్రాముల కొవ్వు కరిగించడం రెజ్లర్లకు పెద్ద సమస్య కాదని అంటున్నారు. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టు పోటీల షెడ్యూల్ కూడా ఒక కారణమని అంటున్నారు.

Also Read: ‘ఒలింపిక్స్ చాంపియన్ కు కేవలం పది లక్షలు ఇస్తారా?’.. పాక్ ప్రధానిపై మండిపడిన మాజీ క్రికెటర్!

బౌట్స్ మధ్య సమయం తక్కువగా ఉండటం వల్ల 100 గ్రాముల బరువు తగ్గించుకోవడం సాధ్యం కాలేదని, ఆ స్పల్ప బరువు వల్ల తమ అథ్లెట్ వినేశ్ ఫోగట్ కి అదనంగా కలిసివచ్చేదేమీ లేదని న్యాయవాదులు వాదించారు. ఒకే రోజు మూడు బౌట్లు పెట్టారు. నీళ్లు ఎక్కువగా తాగేటప్పుడు, ఆ నీటి శాతం కూడా బాడీలో ఉండి, ఆ 100 గ్రాములు బరువు పెరిగి ఉండవచ్చునని సైంటిఫిక్ రీజన్లు తెలిపారు.

పోటీల అనంతరం ఆమె ఆరోగ్యం ద్రష్ట్యా కొంచెం ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి వచ్చిందని కూడా తెలిపారు. చివరి బౌట్ కి సమయం తక్కువగా ఉండటంతో ఆ 100 గ్రాములు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించిందని వారు పేర్కొన్నారు. ఇతర అంశాలతో పాటు అథ్లెట్ల ఆరోగ్యాన్ని కూడా ద్రష్టిలో పెట్టుకుని తీర్పు చెప్పాల్సిందిగా వినేశ్ ఫోగట్ న్యాయవాదులు వాదించారు. ఆగస్టు 13వ తేదీన న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×