BigTV English

Boxer Mary Kom: కుంభమేళాలోనే మేరీకోమ్ బాక్స్ంగ్ పంచ్‌ లు !

Boxer Mary Kom: కుంభమేళాలోనే  మేరీకోమ్ బాక్స్ంగ్ పంచ్‌ లు !

Boxer Mary Kom: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయోగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఇప్పటికే అనేకమంది ప్రముఖులు, వీఐపీలు హాజరై పవిత్ర జలాల్లో స్నానాలు ఆచరించారు. తాజాగా బాక్సర్ మరియు ఒలంపిక్ పథక విజేత ఎంసీ మేరీకోమ్ కూడా ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాను ఆదివారం రోజు సందర్శించి మత సమ్మేళనానికి హాజరైన అనుభవాన్ని పంచుకున్నారు. మహా కుంభమేళాకు మొదటిసారి హాజరైన మేరీకోమ్.. తన అనుభవాన్ని పంచుకుంది.


Also Read: WI vs Pak 2nd Test: వీడెవర్రా బాబు.. గుడ్డలు లేకుండానే క్రికెట్‌ ఆడేస్తున్నాడు ?

మహా కుంభమేళ నిర్వహణ పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ తీర్థయాత్రలో మంచి పారిశుధ్యం, విస్తృతమైన ఏర్పాట్లు, సమర్థవంతమైన పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని మేరీ కోమ్ ప్రశంసించింది. ” ఇది మంచి అనుభవం. కుంభమేళా నిర్వహణకు ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు దీనిని ప్రపంచ స్థాయి తీర్థయాత్రగా మార్చారు.


ఇది నాకు మొదటి అనుభవం. నేను క్రిస్టియన్ అయినప్పటికీ ఇక్కడికి వచ్చి మహా కుంభమేళాకి మద్దతు ఇచ్చాను. రష్యా, అమెరికా నుండి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుండి కూడా ప్రజలు మహా కుంభమేళాకి వస్తున్నారు. నేను కూడా కుంభమేళాలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నాను” అని తెలిపింది. ఈ కుంభమేళా జనవరి 13న పవిత్ర స్నాన్ తో ప్రారంభమైంది. లక్షలాదిమంది భక్తులు తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా ఈ పవిత్ర సాంప్రదాయంలో పాల్గొనేందుకు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు.

ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్లు సమాచారం. మరోవైపు మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా శనివారం రోజు పవిత్ర గంగలో స్నానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సురేష్ రైనా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా 450 మిలియన్ల మంది భక్తులు ఈ ప్రయాగ్ రాజ్ లో జరిగే మహాకుంభమేళాకు వస్తారని అంచనా. ఇక మహా కుంభమేళాలో మేరీ కోమ్ పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన కెరీర్ లో మేరీకోమ్ ఎన్నో మరపురాని విజయాలను సాధించింది. 18 ఏళ్ల వయసులోనే పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్ లో జరిగిన బాక్సింగ్ పోటీలలో అంతర్జాతీయ ప్రవేశం చేసింది ఈ మనీపూర్ స్టార్.

Also Read: Jasprit Bumrah: న్యూజిలాండ్‌ లో బుమ్రాకు ఆపరేషన్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి ఔట్‌?

48 కేజీల విభాగంలో తొలిసారి ఫైనల్ చేరి.. చివర్లో ఓటమిని చవిచూసింది. అనంతరం జరిగిన ఏఐబిఏ ఉమెన్స్ ప్రపంచ ఛాంపియన్ లో విజేతగా నిలిచి.. బాక్సింగ్ లో తొలిసారి బంగారు పతకం సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 2012లో ఒలంపిక్స్ కాంస్య పతక విజేత అయిన మేరీ.. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. అంతేకాదు ఐదు సార్లు ఆసియా చాంపియన్ అయ్యింది. 2020లో ఈమెని కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×