BigTV English

Best Hair Oils: ఈ ఆయిల్స్‌తో జుట్టు పెరగడం గ్యారంటీ !

Best Hair Oils: ఈ ఆయిల్స్‌తో జుట్టు పెరగడం గ్యారంటీ !

Best Hair Oils:  ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా, మందంగా, దృఢంగా , మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. కానీ నేటి జీవన విధానంతో పాటు, పెరుగుతున్న కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, రసాయన ఉత్పత్తులు జుట్టును బలహీనంగా , పొడిగా మారుస్తున్నాయి. ఇటువంటి సమయంలోనే జుట్టుకు పోషణ తో పాటు, రాలకుండా ఉండేందుకు కొన్ని రకాల హెయిర్ ఆయిల్స్ వాడటం చాలా ముఖ్యం.


జుట్టు పెరుగుదల కోసం కొన్ని రకాల హోం మేడ్ ఆయిల్స్ ఉపయోగించడం ఉత్తమ మార్గం. అటువంటి 4 హెల్తీ హెయిర్ ఆయిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ జుట్టు బలంగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ ఆయిల్స్ వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే హెయిర్ ఆయిల్:


1. కరివేపాకు నూనె:
కరివేపాకు ఆహారం రుచిని పెంచడమే కాకుండా జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఉండే విటమిన్ బి, సి , ఐరన్ జుట్టుకు పోషణనిస్తుంది. అంతే కాకుండా ఇది తెల్లరంగులోకి మారిన జుట్టును కూడా తిరిగి నల్లగా కూడా మారుస్తుంది.

ఎలా ఉపయోగించాలి ?
దీన్ని తయారు చేయడానికి, ముందుగా కొబ్బరి నూనెలో కొన్ని తాజా కరివేపాకులను వేసి తక్కువ మంట మీద వేడి చేయండి. ఆకులు నల్లగా మారినప్పుడు నూనెను వడపోసి చల్లార్చి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. అవసరం అనిపించినప్పుడల్లా తలకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. మీకు కావాలంటే, మీరు వారానికి రెండుసార్లు కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జుట్టు బలంగా, మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2. ఆముదం:
జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడాన్ని నివారించడంలో ఆముదం చాలా ఉపయోగకరంగా ఉంటుంది . ఇందులో ఉండే రిసినోలిక్ యాసిడ్ , ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు మూలాలకు పోషణనిచ్చి వాటిని దట్టంగా , దృఢంగా చేస్తాయి. అంతే కాకుండా జుట్టు నల్లగా, ఒత్తుగా మారేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.

ఎలా ఉపయోగించాలి ?
ఆముదం కొద్దిగా మందంగా ఉంటుంది. అందుకని కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్‌లో కలిపి దీనిని జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఆయిల్‌ను జుట్టుకు మసాజ్ చేసి కనీసం 2 గంటలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా ఆముదం నూనెను ఉపయోగించడం వల్ల మీ జుట్టు యొక్క ఆకృతిని మెరుగుపరచవచ్చు. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

3. ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ జుట్టుకు సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది . ఇది స్కాల్ప్ ను హైడ్రేట్ చేసి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది.

ఎలా ఉపయోగించాలి ?
గోరువెచ్చని ఆలివ్ నూనెను జుట్టు , తలపై బాగా రాయండి. 10-15 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత, 1-2 గంటలు అలాగే ఉంచండి. వారానికి 2-3 సార్లు ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల మీ జుట్టును మృదువుగా , మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసి వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

4. ఆల్మండ్ ఆయిల్:

బాదం నూనెలో విటమిన్ ఇ , మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు మూలాలను లోతుగా పోషిస్తుంది. ఇది పొడి , నిర్జీవమైన జుట్టుకు తేమను అందిస్తుంది . అంతే కాకుండా జుట్టును మెరుస్తూ మరియు బలంగా మారేలా చేస్తుంది.

ఎలా ఉపయోగించాలి ?
బాదం నూనెను జుట్టుకు బాగా పట్టించి 10-15 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయండి. దీని తరువాత, జుట్టును షవర్ క్యాప్‌తో కప్పి 1 గంట పాటు వదిలివేయండి. ఈ నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ నిస్తేజమైన జుట్టును మృదువుగా , దృఢంగా మార్చుకోవచ్చు.

Also Read: మీ చర్మం తెల్లగా మెరిసిపోవాలా ? అయితే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

హెల్తీ హెయిర్ ఆయిల్స్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి.
2. జుట్టుకు తగినంత తేమను అందిస్తాయి.
3. తలకు పోషణ అందించడం ద్వారా చుండ్రును తగ్గిస్తాయి.
4. తెల్ల జుట్టు సమస్యను తగ్గిస్తాయి.

Related News

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Big Stories

×