Abdul Razzaq On IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) మధ్య 5 మ్యాచ్ టి20 సిరీస్ (India tour of New Zealand 2026) ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో మొదటి మూడింటిలో టీమిండియా సూపర్ విక్టరీ అందుకొని టైటిల్ కైవసం చేసుకుంది. అయితే మూడింటిలో అద్భుతంగా రాణించిన టీమిండియా.. చివరి రెండు మ్యాచ్ లలో చేతులెత్తేసింది. ఈ క్రమంలో 3-2 తేడాతో న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయింది. ఓవరాల్ గా ఈ సిరీస్ లో రెండు జట్లు తమ ఉజ్జీవులుగా నిలిచాయి. సిరీస్ ఓడిపోయినా కివీస్ తన పరువు కాపాడుకుంది.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) టీ20 సిరీస్ పై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ (Abdul Razzaq On IND VS NZ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ టి20 సిరీస్ వెనుక ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు చేశాడు. కావాలనే టీమిండియా చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 3-2 తేడాతో టి20 సిరీస్ టీమిండియా గెలవాలని న్యూజిలాండ్ తో బీసీసీఐ ముందే ఫిక్సింగ్ చేస్తుందని ఆరోపణలు చేశాడు. లేకపోతే న్యూజిలాండ్ గడ్డపై భారత ఆటగాళ్లు ఇంత అద్భుతంగా ఆడేవాళ్లు కాదంటూ బాంబు పేల్చాడు. ఫ్లాట్ పిచ్ లపై ఆడే టీమిండియా ప్లేయర్లు, కివీస్ గడ్డపై ఇంత బాగా ఆడటంతోనే తనకు అనుమానం వచ్చిందన్నాడు.
న్యూజిలాండ్ బౌలర్లు తొలి మూడు మ్యాచ్ లలో స్లోగా బంతులు వేసి, టీమిండియాకు అనుకూలంగా వ్యవహరించారని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అంతే తప్ప ఈ టోర్నమెంట్ లో టీమిండియా ఆటగాళ్లు పీకిందేమీ లేదని పరువు తీశాడు. ముందే న్యూజిలాండ్ తో ఫిక్సింగ్ చేసుకోవడంతో టీమిండియా గెలవగలిగిందని వ్యాఖ్యానించాడు. దీని అంతటికి కారణం బీసీసీఐ దగ్గర ఉన్న డబ్బులేనని బాంబు పేల్చాడు. డబ్బులతో పాటు ఐపీఎల్ లో న్యూజిలాండ్ ప్లేయర్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో టీమిండియా గెలిచేలా కివీస్ క్రికెట్ బోర్డు వ్యవహరించిందని కూడా ఆరోపణలు చేశాడు. ఇక ఈ టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) టీ20 సిరీస్ పై ఐసీసీకి ( ICC) లేఖ రాస్తానని, బీసీసీఐని రోడ్డుకు ఈడ్చుతానని పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ (Abdul Razzaq) హెచ్చరించాడు. అయితే, దీనిపై టీమిండియా ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. రజాక్ కు అసలు క్రికెట్ పైన అవగాహన లేదంటూ విమర్శలు చేస్తున్నారు.