E-Paper
Advertisement

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో ముస‌లం…వైభ‌వ్ సూర్య‌వంశీ క‌న్నీళ్లు, చేసిందంతా వాడే !

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో ముస‌లం…వైభ‌వ్ సూర్య‌వంశీ క‌న్నీళ్లు, చేసిందంతా వాడే !
Advertisement

Vaibhav Sooryavanshi : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 40% మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో దాదాపు ప్లే ఆఫ్ వెళ్లే జట్లు కూడా అంచనా వేసే పరిస్థితి నెలకొంది. అయితే లేటెస్ట్ గా రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ ( Kolkata Knight Riders vs Rajasthan Royals,) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన కేకేఆర్ ఈ టోర్నమెంటులో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royal) ఓటమి తర్వాత 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బౌండరీ గేటు దగ్గర ఒక్కడే కూర్చొని ఏడ్చాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో మ్యాచ్ ఓడిపోయినందుకు 15 ఏళ్ల కుర్రాడు వైభ‌వ్ సూర్య‌వంశీ ( Vaibhav Sooryavanshi) కన్నీళ్లు పెట్టుకుంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Blessing Muzarabani: న‌ఖ్వీకి చిప్పు దొబ్బిందా ? బ్యాన్ లేదు బొంగు లేదు, PSL కాలి గోటితో సమానం

రాజ‌స్థాన్ జ‌ట్టులో ముస‌లం…వైభ‌వ్ క‌న్నీళ్లు, చేసిందంతా వాడే !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశం అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో 300 స్ట్రైక్ రేట్ సాధిస్తూ దుమ్ములేపుతున్నాడు. అయితే అలాంటి వైభవ్ సూర్యవంశీ తాజాగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. జట్టుతో తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించాడు. కేకేఆర్ తో ( KKR) మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత బౌండరీ గేటు దగ్గర ఒక్కడే కూర్చొని ఏడ్చాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు ఎవరూ కూడా అతని దగ్గరికి రాలేదు. కానీ కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ మాత్రం వైభవ్ ( Vaibhav Sooryavanshi) దగ్గరికి వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వైభ‌వ్ ను టార్చ‌ర్ చేస్తోన్న రియాన్ ప‌రాగ్  (Riyan parag) ?

అయితే ఈ సంఘటనపై అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan royals team) జట్టులో ఉన్న సభ్యులందరూ వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేశారని.. ముఖ్యంగా కెప్టెన్ రియాన్ పరాగ్ ఇబ్బంది పెడుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. తనకంటే ఎక్కువ హైప్, వైభవ్ సూర్య వంశీకి ( Vaibhav Sooryavanshi) వస్తుందన్న భావనలో రియాన్ పరాగ్ ఉన్నాడట. అందుకే మొన్న వాటర్ బాయ్ గా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ వాడుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా కూడా వైభవ్ సూర్య వంశీని బండబూతులు తిట్టినందుకు చెబుతున్నారు. అందుకే సింగిల్ గా వెళ్లి, ఏడ్చినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Advertisement

Also Read:  Ameesha Patel-Kohli: జర్మనీ పిల్ల ఫోటోకు కోహ్లీ లైక్‌..చెప్పు తెగుద్ది అంటూ హీరోయిన్ వార్నింగ్ Ameesha Patel-Kohli

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×