Health Alert: మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవాలంటే.. సరైన ఆహారం , జీవనశైలిని చాలా ముఖ్యం. దీంతో పాటు.. రక్తపోటు, చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేయడం కూడా అవసరం. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న గుండె జబ్బులు, గుండెపోటు, మధుమేహం వల్ల కలిగే సమస్యలను నివారించడానికి, చిన్నప్పటి నుండే రక్తపోటు, చక్కెరపై పెరుగుదలపై జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
రక్తపోటు ఎక్కువగా ఉండే వ్యక్తులకు గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాలు, నరాల సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల, కంటి సమస్యలు, గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుతం యువకులు 20 ఏళ్లలోపు వారు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి.. దీనిపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.
చక్కెర, రక్తపోటు:
మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మాత్రం.. రక్తపోటు, రక్తంలో చక్కెర సాధారణ పరిమితుల్లో ఉండటం చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు. ఈ రెండు సమతుల్యంగా లేకపోతే అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది.
నేటి బిజీ లైఫ్ స్టైల్ కారణంగా అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర అసమతుల్యత తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా మారాయి. అందుకే వీటి బారిన పడకుండా ఉండటానికి సాధారణ స్థాయి గురించి తెలుసుకోవడం అవసరం.
మీ గుండె శరీరమంతా రక్తాన్ని పంప్ చేసినప్పుడు ధమనులపై పడే ఒత్తిడిని రక్తపోటు అంటారు. ఇది రెండు భాగాలుగా విభజించబడింది. గుండె కొట్టుకున్నప్పుడు (సిస్టోలిక్) , గుండె విశ్రాంతి తీసుకున్నప్పుడు (డయాస్టొలిక్) రక్తపోటు. అదేవిధంగా.. మీ రక్తంలోని గ్లూకోజ్ పరిమాణం ఆధారంగా రక్తంలో చక్కెర స్థాయిని కొలుస్తారు.
సాధారణ రక్తపోటు అంటే ?
120/80mmHg రక్తపోటు స్థాయిని సాధారణమైనదిగా పరిగణిస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇది సరైన స్థాయి. 130/80 mmHg కంటే ఎక్కువ ఉంటే అధిక రక్తపోటుగా పరిగణిస్తారు. ఇది మూత్రపిండాలు, గుండె , మెదడుకు హాని కలిగిస్తుంది.
120 mmHg కంటే తక్కువ సిస్టోలిక్ రక్తపోటును నియంత్రించుకునే గుండెపోటు , స్ట్రోక్ వచ్చే ప్రమాదం 25% తగ్గుతుందట. ఆరోగ్యకరమైన జీవనశైలి , ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం , ఉప్పు , చక్కెర తక్కువగా తీసుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు.
Also Read: కాళ్లు, చేతులు నల్లగా మారాయా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే మెరిసిపోతాయ్
రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలి ?
రక్తపోటు లాగే.. చక్కెరను నియంత్రణలో ఉంచుకోవడం కూడా ముఖ్యం. దీనిని ప్రధానంగా రెండు విధాలుగా కొలుస్తారు. ఉపవాసం ఉండి భోజనం చేసిన తర్వాత. భోజనానికి ముందు చక్కెర స్థాయి 100 mg/dL , తిన్న 2 గంటల తర్వాత 140 mg/dL వరకు ఉండటం సాధారణం.
టైప్-2 డయాబెటిస్ రోగులలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం వల్ల డయాబెటిస్ సమస్యలు 21% తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా.. HbA1c ని 7% కంటే తక్కువగా ఉంచడం వల్ల కళ్ళు, మూత్రపిండాలు, నరాలు దెబ్బతినకుండా నిరోధించవచ్చు.