Venkatesh – Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భారత మాజీ కెప్టెన్, సారథిగా టీ20, వన్డే వరల్డ్ కప్ లను గెలిపించిన మహేంద్ర సింగ్ ధోనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి సముచిత రీతిలో గౌరవించింది. ఐసీసీ ఇటీవల ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ధోనీకి చోటు కల్పించింది. 2025 ఏడాదికి గాను ధోనీతో పాటు మరో ఆరుగురు ప్లేయర్లు హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా ధోనీ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ధోనీ కెప్టెన్సీలో ఏప్రిల్ 02, 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ధోనీ చివరికీ సిక్స్ కొట్టి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే అన్ స్టపబుల్ ప్రోగ్రామ్ లో విక్టరీ వెంకటేష్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
Also Read : Lionel Messi : లియోనెల్ మెస్సి ఇలా మారాడేంట్రా… విషం కక్కుతున్న వీడియో వైరల్
అందర్నీ ఆశ్యర్యపరిచిన ధోనీ..!
టీమిండియా కెప్టెన్ ధోనీ 2011లో వరల్డ్ కప్ లో సెంచరీ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టీమిండియా వరల్డ్ కప్ సాధించిన తరువాత ధోనీ బాత్రూంలోకి వెళ్లి 2 నిమిషాల్లోనే గుండు తీసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా విక్టరీ వెంకటేష్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2011 వరల్డ్ కప్ భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న ఫైనల్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తొలి వికెట్ వీరేంద్ర సెహ్వాగ్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత సచిన్ టెండూల్కర్ కూడా ఔట్ కావడంతో టీమిండియా విజయం సాధించదు అని అంతా భావించారు. కానీ టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్.. విరాట్ కోహ్లీ వికెట్ పోకుండా కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరికీ గంభీర్ వికెట్లను కాపాడి 97 పరుగులు చేసి.. చివరికీ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక ఆ తరువాత ధోనీ యువరాజ్ కంటే ముందుగా క్రీజులోకి వచ్చేసి సెంచరీ చేశాడు.
ఇక పూనకమే..
ధోనీ ఆటను చూసి స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు దేశంలోని కోట్లాది మంది ప్రజలు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. వరల్డ్ కప్ సాధించగానే ఊరు ఊరా.. వాడ వాడలా జాతీయ పతకాలు రెపరెపలాడాయి. ప్రతీ భారతీయుడి మనస్సు సంతోషంతో నిండిపోయింది. అప్ప్పుడు భారత జట్టు సాధించిన విజయం సామాన్యమైనది కాదు.. 28 ఏళ్ల తరువాత ప్రపంచ కప్ కలను నిజం చేసిన గెలుపు అది. రెండోసారి టీమిండియాకి వన్డే ప్రపంచ కప్ ను అందించిన విజయం అది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొలి ప్రపంచ కప్ విజయం తరువాత.. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అందిన ఈ మహత్తర విజయం.. సచిన్ కెరీర్ ను పరిపూర్ణం చేసింది. సొంత గడ్డ పై దక్కిన ఈ గెలుపు కెప్టెన్ గా ధోనీకి ఘన కీర్తిని తెచ్చి పెట్టింది. మొత్తానికి క్రికెట్ ను పిచ్చిగా అభిమానించే దేశానికి గొప్ప కిక్కు అందించింది.