Lionel Messi : లియోనెల్ మెస్సీ అర్జెంటినాలో జన్మించాడు. ఇతను ఫుట్ బాల్ ఆటగాడు. ప్రపంచంలో ఫుట్ బాల్ అగ్రశ్రేణి పురుష ఆటగాడిగా రికార్డులు సాధించాడు. ముఖ్యంగా 2009, 2010, 2011, 2012, 2015, 2019, 2021, 2023 ఎనిమిది డి ఓర్ అవార్డులను అందుకున్నాడు. 2022లో అర్జెంటీనా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి పుట్ బాల్ అసోసియేషన్ (FIFA) వరల్డ్ కప్ ని గెలవడంలో సహాయపడ్డాడు. మెస్సీ ఫుట్ బాల్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే తాజాగా మెస్సికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెస్సీ ఇలా మారాడేంట్రా.. బాబు.. ఇలా విషం కక్కుతున్నాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు.
మెస్సీ సంపాదన ఎంతంటే..?
అర్జెంటీనా దేశం పేరు వినిపించగానే మనకు తొలుత గుర్తుకు వచ్చేది మెస్సీ పేరే. ఇతని పేరు వింటేనే సాకర్ ప్రపంచం పూనకాలతో ఊగిపోతుంటుంది. అతని ఆటను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు లక్షల్లోనే ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఇతన్ని అభిమానిస్తుంటారు. అతని ఆట అలా ఉంటుంది మరీ. పుట్ బాల్ ఆడుతున్న వారే కాకుండా.. ఆల్ టైమ్ లో చూసినా ఫుట్ బాల్ దిగ్గజాల్లో ఇతని పేరు ముందువరుసలోనే ఉంటుంది. మైదానంలో చిరుతలా కదులుతూ గోల్స్ చేస్తుంటాడు. దిగ్గజాలకే దిగ్గజంగానూ పేర్గాంచాడు. అదే ఆటతీరుతో 2022 ఫైనల్ లో అర్జెంటీనా టైటిల్ గెలుచుకుంది. మెస్సీ ప్రపంచంలోనే అత్యధిక సంపాదిస్తున్న క్రీడాకారుల్లో అందరికంటే ముందున్నాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్ ల కంటే ఫుట్ బాల్ ద్వారా అతను ఎక్కువగా సంపాదిస్తాడు. మెస్సి నికర సంపద ఏకంగా 600 మిలియన్ డాలర్లు అంట. భారత కరెన్సీలో రూ.4,925 కోట్లు అన్నమాట. మెస్సీ రోజుకు సుమారు రూ.1,05,000 డాలర్లు సంపాదిస్తారట. ఇండియన్ కరెన్సీ ప్రకారం.. సుమారు 87 లక్షలు. బ్రాండ్ ప్రకటనల ద్వారా మెస్సీ కి కోట్లాది రూపాయలు వస్తాయట.
ఆ విషయం గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..
ఈ విషయంలో క్రిస్టియానో రొనాల్డో, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి క్రీడాకారులకు అందనంత దూరంలో ఉన్నాడు. ఇతని ఆస్తుల విషయానికొస్తే.. అర్జెంటీనాలోని నో ఫ్లై జోన్ లో విలాసవంతమైన ఓ బంగ్లా ఉంది. ఇంకా ఎన్నో లగ్జరీ ఇళ్లు ఇతని సొంతం. పలు ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నారు. లియోనెల్ మెస్సీకి రూ.100 కోట్లు విలువైన ప్రైవేట్ జెట్ కూడా ఉండటం విశేషం. ఇక ఈ జెట్ లో ఏకంగా 16 మంది కూర్చునే వీలుంటుంది. సెపరెట్ కిచెన్ కూడా ఉంటుంది. మరోవైపు ఒక హోటల్ కి మెస్సీ యజమానిగా కూడా ఉన్నట్టు సమాచారం. మెస్సీ కుటుంబం విషయానికొస్తే.. తన చిన్ననాటి స్నేహితురాలు ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. మెస్సీ భార్య పేరు ఆంటోనెల్లా రోకజో. అయితే ప్రస్తుతం మెస్సీ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అది నిజమైన వీడియో కాదు.. ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన వీడియో.. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోవడం విశేషం. ప్రస్తుతం మెస్సీ వీనమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.