BigTV English

RCB vs KKR- IPL 2024: వారెవ్వా.. ఏమి సిక్సర్ భయ్..

RCB vs KKR- IPL 2024: వారెవ్వా.. ఏమి సిక్సర్ భయ్..

Venkatesh Iyer smashes monstrous 106-meter six against RCB


Venkatesh Iyer Smashes Monstrous 106-Meter Six Against RCB: ఐపీఎల్ మ్యాచ్ ల్లో రోజుకొక అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్సీబీ వర్సెస్ కోల్ కతా మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టడియంలో జరిగిన మ్యాచ్ లో ఇలాంటిదే ఒకటి  జరిగింది.

కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ కొట్టిన ఒక సిక్సర్ కి స్టేడియమే చిన్నబోయింది. ‘వారెవ్వా.. ఏమి సిక్సర్ రా భయ్ అని అంతా అనుకున్నారు. నెట్టింట ఇదే చర్చ యమా జోరుగా సాగుతోంది. ఒక్క సిక్సర్ తో వెంకటేష్ అయ్యర్ ఓవర్ నైట్ లో ఫేమ్ లోకి వచ్చేశాడు.


మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అందుకు బదులుగా ఛేజింగ్ కి వచ్చిన కోల్ కతా మొదటి నుంచి ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించింది.

అందులో 8.3 ఓవర్ లో ఆఫ్ స్పిన్నర్ జోసెఫ్ వేసిన బౌలింగ్ లో వెంకటేష్ అయ్యర్ కొట్టిన ఒక సిక్సర్ నిజంగానే ఆకాశాన్ని టచ్ చేసిందా? అనిపించింది. ఇంకొంత హైట్ వెళ్లి ఉంటే స్టేడియం అవతల పడేది. దాదాపు స్టేడియం అంత ఎత్తుకు ఎగిరడమే కాదు, గాల్లోనే చాలాసేపు అలా చిన్న భూగ్రహంలా తిరిగింది.

Also Read: ఇద్దరి మనసులు ఒకటాయే.. కొహ్లీ-గంభీర్ కలిసిన వేళ..

106 మీటర్లు ఎత్తుకి వెళ్లిన ఈ సిక్సర్ ను, 2024 సీజన్ లో లాంగెస్ట్ సిక్సర్ గా చెబుతున్నారు. ఇషాన్ కిషన్ కొట్టిన 103 మీటర్ల సిక్సర్ ను వెంకటేష్ బ్రేక్ చేశాడు. ముంబై ఇండియన్స్ వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇషాన్ ఈ సిక్సర్ కొట్టాడు. అయితే రెండు రోజులకే ఆ రికార్డ్ గాలిలో కలిసిపోయింది. మరి వెంకటేష్ ది ఎన్నిరోజులు ఉంటుందో చూడాలి.

ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో 183 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 16.5 ఓవర్లలోనే అధిగమించింది. ఆర్సీబీలో కొహ్లీ చేసిన ఒంటరి పోరాటం ఫలించలేదు. తను 59 బాల్స్ లో 83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. వీటిలో ఒకటి కొహ్లీ ట్రేడ్ మార్క్ సిక్స్ కూడా ఉంది. ఇది కొహ్లీకే మాత్రమై సాధ్యమైన సిక్స్ ఒకటి కొట్టి అభిమానులను అలరించాడు.

Tags

Related News

Roman Reigns vs Bronson reed: క్రికెట్ బ్యాట్ ప‌ట్టి చిత‌క‌బాదిన రోమన్ రీన్స్..బ‌లంగా బాదేసి మ‌రీ, కానీ చివ‌ర‌కు

Sa vs Nam: టీ20 చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం…దక్షిణాఫ్రికాపై నమీబియా సంచలన విజయం

AFG vs PAK: పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన అప్ఘానిస్తాన్…ద్వైపాక్షిక సిరీస్ లు ర‌ద్దు…షేక్ హ్యాండ్ లు కూడా ర‌ద్దు !

IND VS WI: 518-5 వ‌ద్ద‌ టీమిండియా డిక్లేర్డ్…గిల్ భయంక‌ర సెంచ‌రీ, WTCలో చ‌రిత్ర‌

Rohit Sharma Angry: 10 ఏళ్ల కుర్రాడిపై సెక్యూరిటీ దారుణం..కట్టలు తెంచుకున్న రోహిత్ శ‌ర్మ ఆగ్ర‌హం

Yashasvi Jaiswal Run Out: గిల్ సెల్ఫీష్‌, యశస్వి జైస్వాల్ ర‌నౌట్ పై వివాదం, నాటౌట్ అంటూ!

Eng-W vs SL-W: ఇవాళ శ్రీలంక వ‌ర్సెస్ ఇంగ్లాండ్ ఫైట్‌.. పాయింట్ల ప‌ట్టిక వివ‌రాలు ఇవే

Rohit Sharma Car: రోహిత్ శ‌ర్మ విధ్వంస‌ర బ్యాటింగ్‌..రూ.4.57 కోట్ల కారు ధ్వంసం

Big Stories

×