Big Stories

Joinings in Congress : కాంగ్రెస్ గూటికి కేకే కూతురు, పురాణం సతీష్.. హుజూరాబాద్‌లోనూ భారీగా చేరికలు

- Advertisement -

GHMC Mayor Joinned in Congress : గతేడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ అవ్వడం కూడా కారు ఖాళీ అవ్వడానికి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా.. కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దీపదాస్ మున్షీ విజయలక్ష్మికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన సందర్భంగా పురాణం సతీష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిన పార్టీ అని ఆరోపించారు. అలాంటి పార్టీలో ఇన్నాళ్లూ ఉన్నందుకు సిగ్గుగా ఉందన్నారు. మరోవైపు మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. కడియం కావ్య కాంగ్రెస్ తరఫున వరంగల్ ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read : కేటీఆర్ పై క్రిమినల్ కేసు.. ఎందుకంటే..?

లోక్ సభ ఎన్నికలు ముంగిట్లో ఉండగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరుగుతుండటం ఆ పార్టీకి ఊహించని షాకే. ఎప్పటికీ పార్టీని వీడరనుకున్నవారంతా కారు దిగేశారు. మరోవైపు హుజురాబాద్ లోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న, పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక కేకే కూడా కాంగ్రెస్ లో చేరతారన్న వార్తలపై సందిగ్ధత ఏర్పడింది. ఆయన కాంగ్రెస్ లో చేరుతారా ? లేదా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. కేకే, విజయలక్ష్మి కలిసే పార్టీలో చేరతారని వార్తలొచ్చిన నేపథ్యంలో.. మళ్లీ ఆయన ఆలోచనలో పడినట్లు సమాచారం. కేకే కుమారుడు విప్లవ్.. పార్టీ మారేముందు ఒక్కసారి ఆలోచించు నాన్న.. నీ నిర్ణయాన్ని మార్చుకో అని విజ్ఞప్తి చేశారు. పదవుల కోసం పార్టీ మారేవారంతా ఇప్పుడున్న పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News