BigTV English

Vinesh Phogat: అమ్మ ఎంతో కష్టపడి.. మమ్మల్ని పెంచింది: వినేశ్ ఫోగట్

Vinesh Phogat: అమ్మ ఎంతో కష్టపడి.. మమ్మల్ని పెంచింది: వినేశ్ ఫోగట్

Vinesh Phogat Emotional post on Paris olympic Journey: వినేశ్ ఫోగట్.. భారత రెజ్లర్.. ఒలింపిక్ బరిలో గెలిచింది. పతకం దగ్గర ఓడింది.. అయితేనేం భారతీయుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. పతకాలు సాధించిన వారికి కూడా దక్కని కీర్తి వినేశ్ ఫోగట్ కి దక్కింది. సాక్షాత్తూ భారత ప్రధాని మోదీ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.


ఈ సందర్భంగా వినేశ్ ఫోగట్ స్పందించింది. మేం ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాం. అసలు ఒలింపిక్స్ అంటే తెలియకుండా పెరిగాం. ఆడపిల్లకి ఉండే ఎన్నో కోరికలు, మాకూ ఉండేవి.. కానీ మానాన్న ఆలోచనలు వేరేగా ఉండేవి. ఆయన ఆర్టీసీ బస్సు డ్రైవరుగా ఉండేవాడు.. మేం విమానాల్లో తిరగాలని అనుకున్నాడు. ఆయన కోరికను నిజం చేయాలని అనుకున్నానని తెలిపింది.

ఇంట్లో ముగ్గురి పిల్లల్లో నేనంటే.. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. కానీ రెజ్లింగ్ కి వెళతానని అన్నప్పుడల్లా ఆయన నవ్వేసి ఊరుకునేవారు. మా అమ్మ పట్టుదల వల్లే నేనింత వరకు వచ్చాను. మా అమ్మ కల ఇది.. నేను జీవితంలో ఈ స్థాయిలో ఉండటానికి తనెంతో కష్టపడింది. మానాన్నగారు చనిపోయిన కొద్దిరోజులకి తను క్యాన్సర్ బారిన పడింది.


Also Read: భారంతో భారత్‌కి తిరిగి వచ్చిన రెజ్లర్ వినేశ్, ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్

ముగ్గురు చిన్న పిల్లలతో మా అమ్మ ఒంటరిగా ప్రయాణం సాగించింది. ‘చనిపోతానని చెప్పవద్దు.. నిరంతరం పోరాడుతూనే ఉండాలి’అని చెప్పిన మాటలే.. నాకిప్పటికి బరిలో గుర్తుకొస్తుంటాయి. ఆ మాటల స్ఫూర్తితోనే ఫైట్ చేస్తుంటానని తెలిపింది.

ఇంక నా భర్త సోమవీర్ చాలా మంచివాడు. భర్తగాకన్నా మంచి స్నేహితుడని తెలిపింది. నా కష్టంలో, బాధలో అన్నింటిలో తను అండగా ఉంటాడని తెలిపింది. మొత్తానికి తన జీవితంలో పడిన కష్టాలను, కన్నీళ్లను ఒక మధ్య తరగతి అమ్మాయిలా పంచుకున్న తీరు చూసి భారతీయుల మనసులు బరువెక్కాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×