BigTV English
Advertisement

School Boy Thief| గర్లఫ్రెండ్ కు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు క్రిమినల్‌గా మారిన స్కూల్ పిల్లాడు.. ఏం చేశాడంటే..

School Boy Thief| గర్లఫ్రెండ్ కు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు క్రిమినల్‌గా మారిన స్కూల్ పిల్లాడు.. ఏం చేశాడంటే..

School Boy Thief| టీనేజ్ లో ప్రతి ఒక్కరూ భావోద్వేగాలకు తొందరగా లోనవుతారు. ఏది మంచి? ఏది చెడు? అనేది ఎక్కువగా ఆలోచించరు. అప్పుడే యవ్వన దశలోకి ప్రవేశించిడం.. అందంగా ఉండే వారి పట్ల ఆకర్షితులవ్వడం. అదే ప్రేమగా భావించి తప్పుడు మార్గంలో పడే ప్రమాదముంది. అలాంటిదే ఓ ఘటనలో ఒక టీనజ్ స్కూల్ పిల్లాడు తన గర్ల్‌ఫ్రెండ్ కి ఖరీదైన ఐఫోన్ బహుమతిగా ఇవ్వాలని క్రిమినల్ గా మారిపోయాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పోలీసులకు ఒక మహిళ తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసింది. ఇంట్లో నుంచి దొంగలు తన బంగారు నగలు, నగదు దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అయితే పోలీసులు ఈ కేసులో ఎంత వెతికినా దొంగల జాడ తెలియలేదు. పైగా ఆ మహిళకు ఎవరిపైనా అనుమానం లేదని ఎఫ్ ఐ ఆర్ లో తెలిపింది. దీంతో పోలీసులు.. దొంగతనం జరిగిన ఇంటిని బాగా పరిశీలించారు. ఇంటికి రెండు గేట్లు ఉన్నాయి. ఒకవైపు మాత్రమే సిసిటీవి కెమెరా ఉంది. మరోవైపు లేదు. పోలీసులు సీసిటీవి వీడియోలలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు సిసిటీవి కెమెరా లేని మార్గాన్ని మరింత లోతుగా పరిశీలించారు. ఆ మార్గం ద్వారానే దొంగలు రాకపోకలు చేశారని తేలింది.

అయితే ఆ మహిళ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారని పోలీసులు ప్రశ్నించారు. ఆ మహిళ భర్త చనిపోయాడని.. ఆమెకు తన భర్త పెన్షన్ ప్రతినెలా అందుతుందని తెలిపింది. ఆమె ఇంట్లో ఒక పనిమనిషి, ఒక కొడుకు ఉంటున్నారు. పనిమనిషి వారం రోజుల నుంచి సెలవులో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆమె కొడుకు ఆదిత్య(పేరు మార్చబడినది) రెండు రోజుల క్రితం స్నేహితులతో బయటికి వెళ్లాడని ఆమె చెప్పింది.


Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

పోలీసులకు ఇంట్లో పనిమనిషిపై ముందుగా అనుమానం వచ్చింది. పనిమనిషి గ్రామానికి వెళ్లి అతడిని అరెస్టు చేశారు. అయితే విచారణలో అతను దొంగతనం జరిగిన సమయంలో ఢిల్లీలో లేడని తేలింది. దీంతో పోలీసులు.. ఇంటి ఓనర్ కొడుకు ఆదిత్యని ప్రశ్నించాలని చెప్పారు. కానీ ఆదిత్య అందుబాటులో లేడు. అతడి ఫోన్ స్విచాఫ్ వస్తోంది. దీంతో పోలీసులు అతని స్నేహితుల గురించి ఆరా తీశారు. ఆదిత్య స్నేహితులను ప్రశ్నించగా.. ఆదిత్య మూడు రోజులుగా వేరే స్నేహితుడి ఇంట్లో ఉన్నాడని తెలిసింది. పోలీసులు వెంటనే ఆదిత్యని అదుపులోకి తీసుకున్నాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది.

ప్రైవేట్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుకుంటున్న ఆదిత్య.. లిల్లీ(పేరు మార్చబడినది) అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు. లిల్లీని ఇంప్రెస్ చేయడానికి ఆదిత్య ఆమె పుట్టినరోజు పార్టీ ఇవ్వాలని, పైగా ఆమెకు ఒక ఖరీదైన యాపిల్ ఐఫోన్ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం డబ్బులు జమ చేయడం ప్రారంభించారు. కానీ అవి సరిపోకపోవడంతో తన తల్లిని రూ.50 వేలు కావాలని అడిగాడు. ఎందుకని అడిగితే.. స్నేహితులతో కలిసి గోవా హాలిడే టూర్ వెళ్లాలని చెప్పాడు. కానీ ఆదిత్య అంత డబ్బులు లేవని చెప్పింది. కానీ ఆదిత్య ఎలాగోలా డబ్బు ఏర్పాటు చేయాలని.. తన తల్లి నిద్రపోతున్న సమయంలో ఇంట్లోని బంగారు గాజులు, చెవి కమ్మలలు, బంగారు గొలుసులు అన్నీ తీసుకెళ్లి పోయాడు. వాటిని మార్కెట్ లో రెండు వేర్వేరు షాపుల్లో సగం రేటుకే అమ్మేసి డబ్బు తీసుకున్నాడు. ఆ తరువాత లిల్లీ కోసం రూ.50 వేల ఐఫోన్ కొనేశాడు. ఇంకో రెండు రోజుల్లో లిల్లీ పుట్టిన రోజున ఆమెకు కానుక ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా.. పోలీసులు పట్టుకున్నారు.

ప్రస్తుతం ఆదిత్యపై దొంగతనం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆదిత్య మైనర్ కావడంతో అతనికి కోర్టు జువెనైల్ హోమ్‌కు పంపించే అవకాశముందని పోలీసులు తెలిపారు.

Also Read: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ’

Related News

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Hyderabad: యువకుడిపై నడిరోడ్డుపై కత్తితో దాడి.. హైదరాబాద్‌లో మరో హత్యా యత్న ఘటన

Big Stories

×