Danni Wyatt on Virat: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు వన్డేల్లో ఫామ్ ని అందుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించిన కోహ్లీ.. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విరాట్ మళ్లీ ఫామ్ అందుకోవడంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కాగా విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
2017 డిసెంబర్ 11న వీరి వివాహం ఇటలీలోని ఓ విలాసవంతమైన రిసార్ట్ లో జరిగింది. ఇక తనకి సమయం దొరికినప్పుడల్లా విరాట్ కోహ్లీ లండన్ వెళ్లిపోయి అక్కడ ఫ్యామిలీతో గడుపుతూ ఉంటాడు. అయితే విరాట్ కోహ్లీకి వివాహం కాకముందే 2014 సంవత్సరంలో ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డ్యానీ మ్యాట్ చేసిన మ్యారేజ్ ప్రపోజల్ అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. 2014 ఏప్రిల్ నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు విరాట్ కోహ్లీ. దీంతో భారత్ ఫైనల్ కీ చేరింది.
అయితే ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని చూసిన మత్తులో అప్పుడు 22 ఏళ్ళు ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ” కోహ్లీ.. నన్ను పెళ్లి చేసుకో” అని ట్విట్ చేసింది. ఆ తరువాత సంవత్సరం ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లిన విరాట్ కోహ్లీని వెళ్లి కలిసింది. అయితే ఆ సందర్భంలో ఇలాంటి సందేశాలు పెట్టవద్దని విరాట్ కోహ్లీ హెచ్చరించాడని.. ఆ తర్వాత తాను క్షమించమని అడిగాక తనకి ఓ బ్యాట్ ని బహుమతిగా ఇచ్చాడని తెలిపింది. అయితే ఈ ట్వీట్ చేసిన 11 సంవత్సరాల తర్వాత తాజాగా ఈ విషయం గురించి మాట్లాడింది ఈ ఇంగ్లాండ్ క్రికెటర్.
ఈ విషయంపై స్పందిస్తూ.. ” నేను సరదాగా కోహ్లీని పెళ్లి చేసుకోమని అడిగాను. అయితే ఆ ట్వీట్ చేసిన పది నిమిషాల తర్వాత చూస్తే అంతా రచ్చ రచ్చ జరిగింది. ఆరోజు కోహ్లీ ఆడిన విధానం చూసి ఎలా పొగడాలో తెలియక అలా ట్వీట్ చేశాను. ఆ ట్వీట్ తర్వాత నాకు వేళల్లో రీ ట్వీట్లు, కామెంట్లు వచ్చాయి. ఇండియాలోని అన్ని చానల్లలో నా ట్వీట్ గురించే డిస్కషన్స్ నడిచాయి. ఓ టీవీ ఛానల్ మా ఇంటికి ఫోన్ చేసి మా నాన్నతో మాట్లాడేందుకు ప్రయత్నించింది.
ఆ తర్వాత నేను విరాట్ కోహ్లీని కలిస్తే.. ఇలాంటివి చేయవద్దని నాకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నేను క్షమించమని అడిగాను. ఆ తర్వాత నాకు తన బ్యాట్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. విరాట్ ఇచ్చిన బ్యాట్ తో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాను” అని చెప్పుకొచ్చింది. ఇక డానీ వ్యాట్ నిజానికి ఓ స్వలింగ సంపర్కురాలు. గత సంవత్సరం జూన్ లో ఆమెకి ఫుట్బాల్ ఏజెంట్ జార్జియా హడ్జ్ అనే మహిళతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నీలో ఆర్సీబీ మహిళా జట్టు తరుపున ఆడుతుంది.