Virat Kohli – Anushka: బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. క్రికెటర్ల కోసం వెళ్లి 11 మంది మరణించడం… అత్యంత దారుణ సంఘటనగా.. అందరూ చెబుతున్నారు. 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team ) విజయం సాధించడంతో… బెంగళూరు నడిగడ్డపై సెలబ్రేషన్స్ చేసుకున్నారు. భారీ ర్యాలీ నిర్వహించి చిన్నస్వామి స్టేడియం దగ్గర సన్మానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమానికి జనాలు విపరీతంగా వచ్చిన నేపథ్యంలో.. తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు.
దేశం వదిలి పారిపోతున్న కోహ్లీ దంపతులు ?
బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు తొక్కిసలాటలో మరణించారు. 30 వేల మంది కెపాసిటీ ఉన్న చిన్న స్వామి స్టేడియానికి… మూడు లక్షల మంది జనాభా రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ సంఘటన నేపథ్యంలో 11 మంది మృతి చెందగా 33 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో పదిమందికి పైగా ICU లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం అలాగే విరాట్ కోహ్లీ కూడా స్పందించి… తమ సంతాపం తెలిపారు. అయితే ఈ సంఘటన జరిగి సరిగ్గా 18 గంటలు కూడా గడవక ముందే… దేశం వదిలి విరాట్ కోహ్లీ కుటుంబం వెళ్లిపోతోంది.
తన భార్య అనుష్క శర్మ (Anushka Sharma) అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి బెంగళూరు నుంచి… ముంబై కి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ముంబై విమానాశ్రయంలో ఈ ఇద్దరు మెరిశారు. ముంబై నుంచి నేరుగా లండన్ ( London) వెళ్లే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా లండన్ లోనే విరాట్ కోహ్లీ కుటుంబం ఉంటున్న సంగతి తెలిసిందే. కేవలం క్రికెట్ ఉన్న సందర్భంగా మాత్రమే విరాట్ కోహ్లీ… ఆయన ఫ్యామిలీ మొత్తం ఇండియాకు వస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ప్రారంభమైన నేపథ్యంలో ఇండియాకు వచ్చింది విరాట్ కోహ్లీ ఫ్యామిలీ.
ఇక ఇప్పుడు టోర్నమెంట్ పూర్తికాగా… మళ్లీ లండన్ పయనమైంది. అయితే.. నిన్న సాయంత్రం మారణకాండ జరిగి 18 గంటలు కూడా పూర్తికాకముందే లండన్ వెళ్లిపోతోంది కోహ్లీ ఫ్యామిలీ. కోహ్లీ ( Virat Kohli) కోసం వచ్చిన 11 మంది మృతి చెందగా వాళ్లను పట్టించుకోకుండా విదేశాలకు వెళ్లడమేంటని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు నెటిజెన్స్. ఆ 11 కుటుంబాలకు పరిహారం కూడా విరాట్ కోహ్లీ ప్రకటించకపోవడం దారుణం అంటూ మండిపడుతున్నారు. ఈ వివాదం పైన ఎలాంటి అప్డేట్ రాకముందే విరాట్.. ఇండియాను వదిలేయడం దారుణం అంటూ మండిపడుతున్నారు.
Also Read: Stampede at RCB Parade: RCB విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట..7 మంది ఫ్యాన్స్ మృతి, 20 మందికి గాయాలు
Virat Kohli & Anushka Sharma Are Leaving For London Gets Snapped At The Airprot | SBB Xtra #viratkohli #anushkasharma #virushka #saasbahuaurbetiyaan #atsbb #sbb #sbbxtra pic.twitter.com/BZTKAHAFEk
— SBB-Aajtak (@ATSBB) June 5, 2025