BigTV English

Stampede at RCB Parade: RCB విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట..7 మంది ఫ్యాన్స్ మృతి, 20 మందికి గాయాలు

Stampede at RCB Parade: RCB విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట..7 మంది ఫ్యాన్స్ మృతి, 20 మందికి గాయాలు

Stampede at RCB Parade: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజెస్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచిందన్న సంతోషంలో ఉన్న నేపథ్యంలో ఊహించని పరిణామం ఎదురయింది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది.


ALSO READ: Anushka Sharma-Virat Kohli: 18 ఏళ్ళ తర్వాత కప్.. అనుష్కకు టైట్ హాగ్ ఇచ్చి.. ఏడ్చేసిన కోహ్లీ

ఈ తొక్కిసలాటలో 7 మంది బెంగుళూరు అభిమానులు చెందారు. 20 మంది గాయాల పాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన ఆర్సిబి జట్టును చిన్న స్వామి స్టేడియంలో సత్కరించనున్నారు. ఈ క్రమంలోనే స్టేడియంలోకి అభిమానులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఒక వ్యక్తి మృతి చెందాడు.


చిన్న స్వామి ప్రమాదంపై ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ప్రకటన

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ గా నిలిచిన నేపథ్యంలో…. చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సభ నిర్వహించారు. అంతకుముందు చిన్నస్వామి స్టేడియం దగ్గర భారీ పరేడ్ కూడా నిర్వహించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో అభిమానులు కూడా ఎగబడి వచ్చారు. అయితే అంచనాలకు మించి జనాలు అక్కడికి రావడంతో… పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడం జరిగింది.

అనంతరం తొక్కిసలాట జరిగి మరణించారు. అయితే ఈ సంఘటనపై… తాజాగా కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్. మృతుల కుటుంబాలకు క్షమాపణలు ఈ సందర్భంగా చెప్పారు డికె శివకుమార్. ఇలాంటి సంఘటన జరగాల్సి ఉండేది కాదని వెల్లడించారు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు డీకే శివకుమార్.

విధుల్లో 5000 మంది పోలీసులు ఉన్నారని… అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదని… స్పష్టం చేశారు డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఇక ఈ సంఘటనకు పోలీసులు అలాగే కర్ణాటక సర్కార్ కారణం కాదని.. ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. అనుకోకుండా కొంతమంది 19వ గేటు ఓపెన్ చేశారని స్థానికులు చెబుతున్నట్లు.. వెల్లడించే ప్రయత్నం చేశారు డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్. దీనిపై విచారణ చేయిస్తున్నట్లు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ స్పందన

చిన్న స్వామి సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో నివేదిక కూడా కోరారట ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని వెల్లడించారు.

ALSO READ: RCB Maiden IPL Trophy: 18 ఏళ్ల నిరీక్షణ… ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా RCB… ప్రైజ్ మనీ ఎంతంటే

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×