డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్, సీడ్స్ వంటివి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలలో ఒకటి. మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజూ రెండు రకాల డ్రై ఫ్రూట్స్ మాత్రం తినాలి. అవి బాదం పప్పులు, వాల్నట్స్. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఉదయం లేచిన తర్వాత ఖాళీ పొట్టతో వీటిని తినడం వల్ల శరీరానికి పోషణ దక్కుతుంది. రోజంతా శక్తివంతంగా ఉంటుంది.
బాదం పప్పులు, వాల్నట్స్ కలిపి ఒక గుప్పెడు తినేందుకు ప్రయత్నించండి. ప్రతిరోజు రాత్రి రెండు వాల్నట్స్, నాలుగు బాదం గింజలు నీటిలో నానబెట్టుకోండి. ఉదయం లేచాక బ్రష్ చేసుకుని ఖాళీ పొట్టతోనే ఈ రెండు పప్పులను పొట్టు తీసి తినేందుకు ప్రయత్నించండి. రెండు వారాలకే మీలో ఎంతో మార్పును గమనిస్తారు. ముందు కన్నా మీరు ఆరోగ్యంగా అనిపిస్తారు. చర్మం కూడా మెరుగ్గా ఉంటుంది. బాదంపప్పులు, వాల్నట్స్ తినడం వల్ల ఇంకెన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.
బాదంపప్పులు
ప్రతిరోజు బాదం పప్పులు తినడం వల్ల శరీరానికి విటమిన్ ఈ, మెగ్నీషియం, ఆరోగ్యకరమై కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఉదయం పూట వీటిని తింటే శరీరానికి పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. బాదంపప్పులను ప్రతిరోజు రాత్రి నానబెట్టి ఉదయం తినేందుకు ప్రయత్నించండి. ఇది మెదడు పనితీరును మారుస్తుంది. జ్ఞాపకశక్తిని పదునుగా చేస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
వాల్నట్స్
వాల్నట్స్ కూడా ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. ఇవి చూసేందుకు మెదడు ఆకారంలో ఉంటాయి. ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు వీటితో పుష్కలంగా ఉంటాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్ నట్స్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు ఖాళీ పొట్టతో ఒకటి లేదా రెండు వాల్నట్స్ నానబెట్టి తింటే ఎంతో మంచిది. దీనిలో ఇన్ఫ్లమేషన తగ్గించే గుణాలు ఎక్కువ. కీళ్ల నొప్పులు, వాపులను ఇది తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు వాల్నట్స్ ను ప్రతిరోజు తినడం ముఖ్యం.
కేవలం పెద్దలే కాదు ఇంట్లోని పిల్లలకు కూడా వాల్నట్స్, బాదంపప్పులు తినిపించేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు ఇలా వాల్నట్స్, బాదం పప్పులు తినడం వల్ల వారికి మార్కులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మెదడు ఉత్తమంగా పనిచేసి చదివినది గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అలాగే ఏకాగ్రత పెంచుతుంది. చదువుకునే పిల్లలకు ప్రతిరోజు రెండు బాదంపప్పులు, రెండు వాల్నట్స్ పెట్టినా చాలు మంచి ఫలితాలు కనిపిస్తాయి.
బాదం, వాల్నట్స్ రెండూ ఖరీదైనవే. కానీ ఒక్కసారి కొనుక్కుంటే నెల రోజుల పాటూ వస్తాయి. రోజుకు రెండు బాదం, ఒక వాల్నట్స్ తిన్నా చాలు. కాబట్టి మెదడు ఆరోగ్యం కోసం వాటిని తినేందుకు ప్రయత్నించండి. పిల్లలకు తినిపించడం కూడా మంచిది.