Paadutha Theeyaga Promo :పాడుతా తీయగా (Paadutha Theeyaga).. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సిరీస్ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక వివాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత 25 సంవత్సరాలుగా ఎవరు కూడా ఈ షోపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు. కానీ సింగర్ ప్రవస్థి (Singer Pravasthi)తొలిసారి షోలో పక్షపాతం చూపిస్తున్నారని, తనపై బాడీ షేమింగ్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తనతోపాటు తన తల్లిని కూడా గౌరవం లేకుండా సంబోధించారు అంటూ సునీత (Sunitha) పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది సింగర్ ప్రవస్థి. పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు వివాదం సృష్టించింది. అయితే ఈమె మాటలకు అటు సునీతతో పాటు పాడుతా తీయగా ప్రోగ్రాం నిర్వహిస్తున్న జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ కూడా స్పందించి ఖండించారు.
జడ్జిగా సింగర్ సునీత మిస్.. ఆమె స్థానంలో ఎస్పీ చరణ్..
ఇకపోతే ఇప్పటికే ఏ షో నుంచి ప్రవస్తి ఎలిమినేట్ అయిపోయింది. కానీ ఆ ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ కాలేదు. దీంతో ఆ ఎపిసోడ్ కోసం అటు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో కాలేజీ రోజులకు సంబంధించిన పాటలను సింగర్స్ ఆలపించారు.
ఇక ఎపిసోడ్ మొదట్లో ఎస్పీ చరణ్ (SP Charan) ఒక పాట పాడుతారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం “నిన్ను రోడ్డుమీద చూసినది లగ్గాఎత్తు” అనే పాట పాడి ఎపిసోడ్ కి పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగించారు. ఇకపోతే ఎప్పటిలాగే ఈ షో కి ఎం.ఎం.కీరవాణి (MM Keeravani), సింగర్ సునీత (Singer Sunitha), చంద్రబోస్ (Chandrabose ) జడ్జిలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా విడుదల చేసిన ఎపిసోడ్లో మాత్రం సునీత కనిపించలేదు . సింగర్ సునీత స్థానంలో జడ్జిగా ఎస్పీ చరణ్ కూర్చోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ:Niharika: ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మెగా డాటర్.. ప్రత్యేకించి అక్కడే ఎందుకు?
ప్రోమో పై అనుమానాలు..
ఇది చూసిన నెటిజన్స్ ప్రవస్థి ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ ఇదేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ తాను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ రావడానికి ఇంకో మూడు లేదా నాలుగు వారాల సమయం పడుతుందని ఇటీవల ఒక వీడియోలో ప్రవస్థి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికైతే ఇప్పుడు తాజాగా వదిలిన ప్రోమోలో అటు సింగర్ సునీత జడ్జి స్థానంలో లేకపోవడం.. ఇటు ప్రవస్తి పర్ఫామెన్స్ కూడా చూపించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కేవలం కంటెస్టెంట్లతో పాటు కూర్చున్నట్టుగా ఉన్న ఫుటేజ్ మాత్రమే చూపించారు.
ఇక మరొకవైపు ఈ వివాదం తలెత్తిన దగ్గర్నుంచి ఎక్కువగా ప్రోమోలలో ప్రవస్తీనే కనిపిస్తోంది. ఎన్నో షోలలో విజేతగా నిలిచిన ఈమె ఈ షో నుంచి ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతుందని ఆమె కూడా ఊహించి ఉండదు. ఆ కోపంతోనే ఇలాంటి ఆరోపణలు చేసిందంటూ పలువురు సింగర్లు కూడా విమర్శిస్తున్నారు. అయితే ప్రవస్తి మాత్రం ఇంతకుముందు ఎన్నో షోలలో తాను ఎలిమినేట్ అయ్యానని, అప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేయాలి కదా.. ఎందుకు చేయలేదు? ఇప్పుడే చేస్తున్నానంటే ఎంత నరకం అనుభవించానో అర్థం చేసుకోండి అంటూ కూడా స్పష్టం చేసింది ప్రవస్థి. ప్రస్తుతం పాడుతా తీయగా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.