BigTV English

Virat Kohli: నన్ను కింగ్ అని పిలవద్దు: విరాట్ కొహ్లీ

Virat Kohli: నన్ను కింగ్ అని పిలవద్దు: విరాట్ కొహ్లీ

Virat Kohli asks fans to stop calling him 'King': 'I feel embarrassed'


Virat Kohli asks fans to stop calling him ‘King’ ‘I feel embarrassed’: ఐపీఎల్ 17వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్ బాక్స్ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అభిమానులు చాలా ఎక్కువమంది కార్యక్రమానికి వచ్చారు. అందరూ కింగ్ కొహ్లీ అని పిలుస్తుంటారు. తను 2008 నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. ఈ కార్యక్రమానికి హాస్ట్ గా దానీష్ సేత్ వచ్చాడు. అయితే తను కూడా అందరిలాగే కింగ్ కొహ్లీ అని సంభోదించేసరికి.. తను స్వీట్ వార్నింగ్ లా ఇచ్చాడు.

నన్ను విరాట్ అని పిలవండి.. నిజానికి ఆ పేరు పెట్టి పిలుస్తుంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నాను. అంతేకాకుండా అది కూడా ఒక నెగిటివ్ వైబ్రేషన్ కూడా క్రియేట్ అవుతుంటుంది. మనం నిజంగానే కింగ్ ఏమో అని భ్రాంతిని కలిగిస్తుంది. అది అప్పుడప్పుడు ఆటపై కూడా ప్రభావం చూపిస్తుంటుంది. ఇక నుంచి అభిమానులు అందరూ కూడా విరాట్ అని పిలవండి.. ఆ పేరైతేనే నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఊరికినే లేనిపోని ట్యాగ్ లు పెట్టి ఇబ్బంది పెట్టవద్దని వేడుకున్నాడు.


Also Read: ఈ జట్లకి ఐపీఎల్ ట్రోఫీ ఎందుకు రాలేదు?

ఇదే విషయాన్ని డుప్లేసిస్ తో కూడా చర్చించానని తెలిపాడు. ఈ సందర్భంగా వుమన్ ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ గెలవడంపై అమ్మాయిల జట్టుని ఘనంగా సత్కరించారు. ఈ విషయంపై కొహ్లీ మాట్లాడుతూ ఆర్‌సీబీ మ‌హిళ‌లు డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ గెల‌వ‌డం నిజంగా గొప్పవిషయం. మేం కూడా ఈసారి ఐపీఎల్‌లో విజ‌యం సాధించి ట్రోఫీల‌ను డ‌బుల్ చేస్తే, అది క‌చ్చితంగా ఎంతో ప్ర‌త్యేకంగా నిలుస్తుంది” అని చెప్పుకొచ్చాడు.

కింగ్ అని పిలవద్దు అని చెప్పిన కొహ్లీ మాటలపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. క్రికెట్ ఆటగాళ్లు పలువురికి బోలెడు పేర్లు ఉన్నాయి. సచిన్ ని క్రికెట్ గాడ్, క్రికెట్ దేవుడు, ఇంకా మాస్టర్ బ్లాస్టర్ అని పిలుస్తారు. సౌరభ్ గంగూలిని దాదా అంటారు, మహేంద్ర సింగ్ ధోనికి కూల్ కెప్టెన్ అంటారు.

వీరేంద్ర సెహ్వాగ్ ని నవాబ్ ఆఫ్ నజార్ గర్  అంటారు. అనిల్ కుంబ్లేని జుంబో, క్రిస్ గేల్ ని యూనివర్సల్ బాస్, కపిల్ దేవ్ ని హర్యానా హరికేన్, సునీల్ గవాస్కర్ ని లిటిల్ మాస్టర్, పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ ని రాయల్పిండి ఎక్స్ ప్రెస్, వసీం అక్రమ్ ని  సుల్తాన్ ఆఫ్ స్వింగ్ ఇలా రకరకాలుగా పిలుస్తారు. అది అభిమానుల ఇష్టం, మీకిష్టం లేని పని చేయమని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×