4 Teams Who Have Never Won IPL Trophy: ఐపీఎల్ 2024 సీజన్ మరో రెండురోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికి ట్రోఫీ సాధించని నాలుగు జట్లున్నాయి. వీటిలో ఒకటి ఆర్సీబీ గురించి చర్చించుకున్నాం. ఇంకా మిగిలిన మూడింటిలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. మరిప్పుడు వాటి సంగతేమిటో చూద్దాం.
పంజాబ్ కింగ్స్ విషయం చెప్పాలంటే ఐపీఎల్ సీజన్ 2014లో ఫైనల్ వరకు వెళ్లింది. అప్పుడు కెప్టెన్ జార్జ్ బెయిలీ. ఆ సీజన్ లో పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్ గా నిలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే అనూహ్యంగా నాకౌట్ మ్యాచ్ లో ఓటమి పాలైంది.
పంజాబ్ కింగ్స్ ఓటమికి ప్రధాన కారణాలేమిటంటే…
1. ఒక మంచి కెప్టెన్ ప్రధాన సమస్య
2. పంజాబ్ కింగ్స్ కి ఎప్పుడూ మంచి కోచ్, టీమ్ మెంటర్స్ లేరు
3. మిడిల్ ఆర్డర్ బలంగా లేదు
4. ఆల్ రౌండర్ల కొరత వేధిస్తోంది
5. కీలక సమయాల్లో వికెట్లు తీసే మంచి స్పిన్నర్లు లేరు
Also Read: మళ్లీ కామెంటరీ బాక్స్ లోకి సిక్సర్ల సిద్దూ..
ఢిల్లీ క్యాపిటల్స్ మాటేమిటి?
ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే 2020లో జట్టు ఫైనల్ వరకు వెళ్లింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పరాజయం పాలైంది. ఆనాడు ఢిల్లీ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ వైఫల్యానికి కారణాలేమిటి?
1. ఢిల్లీ క్యాపిటల్స్ కి సరైన కెప్టెన్ లేడు
2. మంచి ఓపెనర్లు లేరు. వీరు త్వరగా అయిపోవడంతో ఆ ప్రెజర్ మిడిల్ ఆర్డర్ మోయలేకపోతోంది.
3.ఆల్ రౌండర్స్ కొరత వేధిస్తోంది.
వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఉండాలి. స్పిన్నర్ కమ్ బ్యాటర్ ఉండాలి. ఇలా ప్రతీ విభాగంలో టూ ఇన్ వన్ ఉన్నప్పుడే జట్టు బలంగా ఉంటుంది.
లక్నో సూపర్ జెయింట్స్ సంగతేమిటి?
లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఐపీఎల్ లోకి కొత్తగా 2022లో ప్రవేశించింది. అది రెండు సీజన్లు మాత్రమే ఆడింది. రెండింట్లో కూడా టాప్ ఫోర్ లో నిలిచింది. బెస్ట్ టీమ్ గా ఉండేందుకు ప్రయత్నించింది.
కొన్ని సమస్యలు వీరికి ఉన్నాయి…
1. మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉంది. వీళ్లెప్పుడు టాపార్డర్ పైనే ఆధారపడి ఉన్నారు.
2. మంచి ఆల్ రౌండర్స్ లేరు.
3. స్పిన్ విభాగం కూడా బలహీనంగా ఉంది. రవి బిష్ణోయ్ ఒక్కడే ఉన్నాడు. అతను క్లిక్ అయిన రోజు బాగుంటుంది. ఆరోజు అతనికి పిచ్ సహకరించకపోతే ఇంతే సంగతి అన్నట్టు ఉంటోంది.
ఇదండీ సంగతి. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం సందర్భంగా ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోని జట్లు, వాటి వెనుక కారణాలు ఇవి. ఈసారైనా వీటిని అధిగమించి ముందంజ వేస్తారని ఆశిద్దాం.