BigTV English

Virat Kohli: శ్రీలంకపై చెలరేగిన కొహ్లీ.. సెంచరీతో సచిన్‌ రికార్డు బ్రేక్..

Virat Kohli: శ్రీలంకపై చెలరేగిన కొహ్లీ.. సెంచరీతో సచిన్‌ రికార్డు బ్రేక్..

Virat Kohli: విరాట్ కొహ్లీ వీరవిహారం చేశాడు. శ్రీలంకపై చెలరేగి ఆడాడు. 80 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. 87 బాల్స్ లో 12 ఫోర్లు, ఒక సిక్స్ తో 113 రన్స్ చేశాడు. రోమిత్ శర్మ (83), శుభ్ మల్ గిల్ (70) సైతం రాణించడంతో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ సాధించింది.


ఫామ్ లో ఉంటే కొహ్లీని అడ్డుకోవడం ఏ బౌలర్ తరం కాదు. ఇదే విషయం మరోసారి నిరూపించాడు. సెంచరీతో సచిన్ రికార్డును దాటేశాడు. శ్రీలంకపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా విరాట్ కొహ్లీ‌ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు సచిన్‌, కొహ్లీలు ఎనిమిదేసి సెంచరీలతో సమంగా ఉండగా.. ఇప్పుడు శ్రీలంకపై 9వ సెంచరీ కొట్టి.. సచిన్ ను అధిగమించాడు. శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియాపైనా తొమ్మిది సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

మరోవైపు, స్వదేశంలో 20 సెంచరీలతో సచిన్‌తో సమంగా నిలిచాడు విరాట్ కొహ్లి. భారత్ లో సచిన్‌ 164 వన్డేల్లో 20 సెంచరీలు కొట్టగా.. కొహ్లీ మాత్రం కేవలం 102 వన్డేల్లోనే 20 సెంచరీలు బాదేశాడు.


అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ సెంచరీల సంఖ్య 73కి చేరింది. 27 టెస్టు సెంచరీలు కాగా.. 45 వన్డే శతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా కప్‌లో తొలిసారి టీ20ల్లోనూ సెంచరీ చేశాడు కొహ్లి. 100 సెంచరీలు చేసిన సచిన్‌ తర్వాత.. 73 శతకాలతో అత్యధిక శతకాలతో రెండో స్థానంలో నిలిచాడు విరాట్.

వన్డేల్లో విరాట్ కొహ్లీ 12,584 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. సచిన్‌ 18,426 పరుగులతో హయ్యెస్ట్ స్కోరర్ గా టాప్ లో కొనసాగుతున్నాడు. మరి, సచిన్ రికార్డును కొహ్లీ సాధించేనా!?

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×