Virat Kohli: ఇటీవల భారత జట్టు టెస్టుల్లో అత్యంత చెత్త ప్రదర్శన, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ {డబ్ల్యూటీసి} ఫైనల్ బెర్త్ దక్కించుకోవడంలో విఫలం కావడం, డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు, సీనియర్ల పేలవ ఆటతీరు నేపథ్యంలో బీసీసీఐ జట్టులో ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా నుండి తిరిగి భారత్ కి వచ్చాక.. జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతం గంభీర్ తో పాటు కొంతమంది బీసీసీఐ బోర్డు సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు.
Also Read: Lisa Sthalekar: తల్లిదండ్రులు వద్దనుకున్నారు.. అనధాశ్రమం నుండి ఆస్ట్రేలియా క్రికెటర్ గా లీసా ప్రయాణం
ఈ సమావేశంలో జట్టులో క్రమశిక్షణ, ఐక్యత, సానుకూల వాతావరణన్ని పెంపొందించేందుకు కొత్తగా పదినిబంధనలను ప్రవేశపెట్టారు. ప్రతి ఆటగాడు ఈ పది రూల్స్ ని ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది బీసీసీఐ. ఈ పది రూల్స్ లో ఆటగాడు ఏదైనా టూర్, సిరీస్ లకు వెళ్లేటప్పుడు తమ వ్యక్తిగత సిబ్బంది.. అంటే వ్యక్తిగత మేనేజర్లు, చెఫ్స్, అసిస్టెంట్స్, సెక్యూరిటీని తీసుకు వెళ్లడంపై నిషేధం విధించింది. అయితే బీసీసీఐ పెట్టిన ఈ షరతు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఇబ్బందికరంగా మారింది.
భారత క్రికెటర్లలో డైట్ పేరు చెప్పగానే వెంటనే గుర్తోచ్చే పేరు విరాట్ కోహ్లీ. ఇతడు చాలాకాలంగా డైట్, జిమ్ బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బాడీని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. కోహ్లీ ఎక్కడపడితే అక్కడ, ఏది పడితే అది తినడన్న విషయం చాలా మందికి తెలుసు. ఇతడికి సపరేట్ చెఫ్ ఉంటాడు. కోహ్లీ తనకు కావలసింది చెబితే.. అది వండి పెడుతుంటాడు. కానీ బీసీసీఐ రూల్ తో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫుడ్ కి ఇబ్బంది పడుతున్నాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా దుబాయ్ కి వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ బీసీసీఐ రూల్ తో కోహ్లీ తన చెఫ్ ని వెంట తీసుకువెళ్లకపోవడంతో.. తనకు కావలసిన ఫుడ్ ని తెప్పించాలని లోకల్ టీమ్ మేనేజర్ కి చెప్పాడట. అంతేకాదు ఆ ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ఉండాలనే దాని గురించి పూర్తిగా వివరించడంతో.. ఆ మేనేజర్ వెంటనే దుబాయిలోని ప్రముఖ రెస్టారెంట్ నుండి ఫుడ్ ప్యాకెట్లను కోహ్లీకి తెప్పించారట.
Also Read: Indian Flag – Gaddafi Stadium: దెబ్బకు దిగివచ్చిన పాకిస్తాన్… ఇండియా జెండా ఎగరవేసిందిగా?
ఆదివారం రోజు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించారు. ప్రాక్టీస్ పూర్తయిన వెంటనే కోహ్లీకి ఆ స్పెషల్ ఫుడ్ ప్యాకెట్లు డెలివరీ అయ్యాయి. దీంతో గ్రౌండ్ లోనే కోహ్లీ తన లంచ్ ని పూర్తి చేశాడు. ఇక జర్నీలో తినేందుకు మరికొన్ని ప్యాకెట్స్ ని దాచుకున్నాడు. ఆ ఫుడ్ తిని విరాట్ కోహ్లీ వాంతులు చేసుకున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. అలా ఈ ఛాంపియర్స్ ట్రోఫీ పూర్తయ్యే వరకు విరాట్ కోహ్లీకి ఫుడ్ తిప్పలు తప్పేలా లేవని తెలుస్తోంది. బీసీసీఐ తీసుకువచ్చిన ఈ కొత్త రూల్.. మొత్తానికి విరాట్ కోహ్లీ పొట్ట కొడుతుందని అంటున్నారు ఆయన అభిమానులు.