Lisa Sthalekar: క్రీడాభిమానులకు ఈ ఆస్ట్రేలియన్ మహిళ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ లీసా స్తాలేకర్ గుర్తుండే ఉంటుంది. ఈమె భారత దేశంలో జన్మించారని తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. ఈమె తల్లిదండ్రులు వారికి ఆడపిల్ల పుట్టిందని చెత్తబుట్టలో పడేశారు. ఈ లెజెండ్ క్రికెటర్ పుట్టిన క్షణమే తల్లిదండ్రులకు భారమైంది. వారు చెత్తబుట్టలో పడేసి వెళ్ళిపోతే.. ఓ అనాధ శరణాలయం తన అక్కున చేర్చుకుంది. ఆ తరువాత ఈ పసికందు మరో కుటుంబానికి వరంగా మారింది.
Also Read: Indian Flag – Gaddafi Stadium: దెబ్బకు దిగివచ్చిన పాకిస్తాన్… ఇండియా జెండా ఎగరవేసిందిగా?
ఆ తరువాత ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక కావడమే కాదు, ఐసీసీ క్రికెటర్ అవార్డును సైతం అందుకుంది. ఇప్పుడు ఆమె సక్సెస్ జర్నీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె సక్సెస్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1979 ఆగస్టు 13న జన్మించిన లీసా స్థలేకర్ ని ఆమె తల్లిదండ్రులు మహారాష్ట్ర పూణేలోని శ్రీవాస్త అనాధాశ్రమం బయట ఉన్న చెత్తబుట్టలో పడేశారు. దీంతో ఆమె అనాధ శరణాలయంలోనే పెరిగింది. ఈమెకి శరణాలయం సిబ్బంది లైలా అనే పేరు పెట్టారు.
ఆ తర్వాత కొంతకాలానికి ఆస్ట్రేలియా నుండి హారెన్, స్యూ అనే దంపతులు పూణేలోని ఈ అనాధ ఆశ్రమానికి వచ్చారు. వారు అక్కడ ఓ అబ్బాయిని దత్తత తీసుకోవాలని అనుకున్నారు. కానీ వీరికి లైలా చాలా ఆకర్షణగా కనిపించింది. దీంతో వెంటనే ఆమెను దత్తత తీసుకోవాలని భావించారు. అనంతరం చట్టపరమైన విధివిధానాలను అన్ని పూర్తి చేసి.. లైలాని ఆ దంపతులు వారి వెంట ఆస్ట్రేలియాకి తీసుకువెళ్లారు. అక్కడికి తీసుకు వెళ్లిన తరువాత లైలా పేరును లీసా అని మార్చారు.
ఇక కొంతకాలానికి వీరి కుటుంబం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్థిరపడింది. ఇక సిడ్నీలోనే క్రికెటర్ గా లీసా ప్రయాణం ప్రారంభమైంది. లీసా అతని తండ్రి హరెన్ వద్ద క్రికెట్ నేర్చుకుంది. తన తండ్రితో కలిసి రోజు ఇంటి వెనక ప్రాంగణంలో క్రికెట్ ఆడటం నేర్చుకుంది. పార్కులో అబ్బాయిలతోనూ రోజు క్రికెట్ ఆడేది. ఆ తరువాత 1997లో న్యూ సౌత్ వెల్స్ తరఫున అరంగేట్రం చేసింది. ఇక 2003 లో ఆస్ట్రేలియా తరఫున తన తొలి వన్డే మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత 2005లో మొదటి టీ-20 మ్యాచ్ ఆడింది. ఇప్పటివరకు తన కెరీర్ లో మొత్తం ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లలో 416 పరుగులు చేసింది.
Also Read: IPL 2025: ముంబైకి బిగ్ షాక్…ఇద్దరు ప్లేయర్లు ఔట్ ?
ఇక 125 వన్డేలలో 23 వికెట్లు పడగొట్టింది. అలాగే 54 టి-20 ల్లో 769 పరుగులతో పాటు, బౌలింగ్ లో 60 వికెట్లు పడగొట్టింది. ఇక 1000 పరుగులు చేసిన మొదటి మహిళా క్రికెటర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా వంద వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్ గా చరిత్రకెక్కింది. ఈమె ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆల్ రౌండర్. అంతేకాకుండా ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గాను పేరు ప్రఖ్యాతలుగాంచింది. ఇక 2013లో అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించింది. ఈమెను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చడంతో.. క్రీడల్లో ఆమె చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోయింది.